ఏం తేలనుంది?: రవితేజ సోదరుడి మృతిపై నేడే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్!..
భరత్ మద్యం సేవించాడా? లేక డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడా? వంటి విషయాలు ఈ రిపోర్టు ద్వారా వెల్లడికానున్నాయి.
హైదరాబాద్: అతివేగంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టి హీరో రవితేజ తమ్ముడు భరత్ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. గత నెల 24వ తేదీ రాత్రి 10గం. సమయంలో ఆయన దుర్మరణం చెందగా.. మరునాడు ఉదయం వరకు ఈ విషయం బయటకు రాలేదు.
ప్రమాద సమయంలో భరత్ కారులో వోడ్కా బాటిల్ దొరకడం ఆయన మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ఉంటాడన్న అనుమానాలకు ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రమాదంపై కచ్చితమైన కారణాలు తేలాలంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రావాల్సి ఉంది. గురువారం నాడు ఈ రిపోర్టు రానుండటంతో.. ప్రమాద కారణాలపై ఆసక్తి నెలకొంది.

భరత్ మద్యం సేవించాడా? లేక డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడా? వంటి విషయాలు ఈ రిపోర్టు ద్వారా వెల్లడికానున్నాయి. మరోవైపు తమ్ముడి అంత్యక్రియలకు దూరంగా ఉన్న కారణంతో.. రవితేజను మీడియా వెంటాడుతూనే ఉంది. తమ్ముడిని అలాంటి పరిస్థితిలో చూసి తట్టుకోలేకే.. తాను అక్కడికి రాలేకపోయానని రవితేజ చెబుతున్నప్పటికీ.. చాలామంది ఆయన సమాధానంతో సంతృప్తి చెందడం లేదు.












Click it and Unblock the Notifications