బీరు బాటిల్లో ఫంగస్: కింగ్ ఫిషర్‌పై కోర్టుకెళ్తామని యువకులు
మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలోని ఓ దుకాణంలో కొందరు యువకులు బీరు కొన్నారు. అందులోని ఓ బీరు సీసాలో ఫంగస్ వచ్చింది. దీంతో అవాక్కయిన ఆ యువకులు దీనిపై న్యాయపోరాటం చేస్తామని చెబుతున్నారట.

హైదరాబాదుకు చెందిన కొందరు యువకులు జిల్లాలోని కల్వకుర్తిలో గల ఓ వైన్ షాప్‌లో బీరు సీసాలు కొన్నారు. అందులో ఓ సీసాలో ఫంగస్ కనిపించింది. పురుగులు కూడా కనిపించాయి. దీంతో సదరు బీరు సీసా కంపెనీ పైన కోర్టుకు వెళ్తామని చెబుతున్నారు. ఆ బీరు సీసాలు కింగ్ ఫిషర్ కంపెనీకి చెందినవిగా తెలుస్తోంది.

బిటెక్ విద్యార్థి మృతి
వేగంగా వస్తున్న డిసిఎం ఓ బైకును ఢీకొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్న సందీప్ తన స్నేహితుడు సాయితో కలిసి బైక్ పైన వస్తున్నాడు.

ఆ సమయంలో ఎదురుగా వచ్చిన డీసీఎం వీరి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న సందీప్ అక్కడిక అక్కడే మృతి చెందాడు. సాయికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications