కేసీఆర్‌పై జానారెడ్డి ఛలోక్తులు: సభలో నవ్వులు..
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తాను బహిరంగంగా బాధపడుతుంటే.. సీఎం అంతర్గతంగా బాధపడుతున్నారని జానారెడ్డి వ్యాఖ్యానించడంతో సభ్యులంతా ఒక్కసారిగా నవ్వారు.
హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సందర్బంగా విపక్ష నేత జానారెడ్డి, సీఎం కేసీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. జానారెడ్డి వ్యాఖ్యలతో సభలో నవ్వులు విరిశాయి.
పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆ ప్రభావం రాష్ట్రం ఆదాయంపై పడలేదని కేసీఆర్ చెబతున్నారని జానారెడ్డి అనగా.. మధ్యలో కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని తాను పేర్కొనలేదని, సభ్యులకు ఇచ్చిన లిఖితపూర్వక పత్రాల్లోను అలా పేర్కొనలేదని తెలిపారు.

కేసీఆర్ సమాధానంపై స్పందించిన జానా.. కేసీఆర్ అలా అనకపోయినా ఆయన మాటల సారాంశం తనకు అలాగే అనిపిస్తోందన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తాను బహిరంగంగా బాధపడుతుంటే.. సీఎం అంతర్గతంగా బాధపడుతున్నారని జానారెడ్డి వ్యాఖ్యానించడంతో సభ్యులంతా ఒక్కసారిగా నవ్వారు.












Click it and Unblock the Notifications