విషమంగానే కాంగ్రెస్ కురువృద్ధుడు ‘కాకా’ ఆరోగ్యం
హైదరాబాద్: కాంగ్రెస్ కురు వృద్ధుడు, మాజీ ఎంపి జి వెంకటస్వామి (కాకా) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోమవారం కాకా చికిత్స పొందుతోన్న బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు.
కాకా ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఆయనను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ ఆయన నగరంలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆదివారం రాత్రి వెంకటస్వామి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్‌లోకి తరలించారు. గత కొద్ది నెలల క్రితం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై తిరిగి కోలుకున్నారు. మళ్లీ అనారోగ్యం ఏర్పడటంతో తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు.
కాగా, వెంకటస్వామిని సోమవారం సీనియర్ కాంగ్రెస్ నేతలు డి శ్రీనివాస్, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తోపాటు పలువురు నేతలు పరామర్శించారు. కాకా తొందరగా కోలుకోవాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications