పెద్దపల్లి ప్రజలకు సేవ చేయాలనుంది...అందుకే రాజీనామా: గడ్డం వివేక్
హైదరాబాదు: మాజీ ఎంపీ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు గడ్డం వివేక్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని తెలుపుతూ తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపారు. 2019 ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్ తనకే కేటాయిస్తానని చెప్పడంతో టీఆర్ఎస్‌కు తిరిగి వచ్చినట్లు తన లేఖలో పేర్కొన్న వివేక్... తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు తన తండ్రి ఎలాగైతే పెద్దపల్లి ప్రజలకు సేవ చేశారో... ఎంపీగా తాను కూడా సేవచేయాలని భావిస్తున్నట్లు చెప్పారు వివేక్.
ఇక పెద్దపల్లి సీటుపై వివేక్ ఆశలు పెట్టుకున్నప్పటికీ కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంపై మనస్తాపానికి గురయ్యారు వివేక్. కొందరు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని వివేక్ తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇక పెద్దపల్లి టికెట్‌ను పార్టీలో కొత్తగా చేరిన వెంకటేష్ నేతకు కేసీఆర్ కేటాయించారు.

ఇక వివేక్ తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇండిపెండెంట్‌గానే ఆయన పెద్దపల్లి బరిలో నిలుస్తారని సమాచారం. 2014లో అప్పుడు కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీచేసిన వివేక్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బాల్కా సుమన్‌పై ఓటమి చవిచూశారు.












Click it and Unblock the Notifications