కొత్త గెటప్‌లో ఆశ్చర్యానికి గురిచేసిన గద్దర్: ఎందుకంటే..?
హైదరాబాద్: టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంంటే.. చేతిలో కర్ర, భుజంపై గొంగళి, కాళ్లకు గజ్జెలతో కళ్ల ముందు మెదులుతాయి. కానీ, గద్దర్ తన గెటప్ పూర్తిగా మార్చేశారు. ప్యాంటు, షర్ట్, మెడలో టైతో ఆయన దర్శనమివ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తెలంగాణ సామాజిక సంఘాల ఐక్య వేదిక మహబూబ్‌నగర్ జిల్లా ఆవిర్భావ సభలో ఆయన ఇలా సరికొత్త అవతారంలో కనిపించారు. ఆదివారం జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలు గడుస్తున్నా.. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదని, ఆ దిశగా ప్రభుత్వాలు సరైన కృషి చేయడం లేదని అన్నారు.

ప్రజల్లో కూడా మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన నుంచే మార్పు జరగాలని భావించి ప్యాంట్, ఇన్‌షర్ట్ వేసుకుని, టై కట్టుకున్నానని చెప్పారు. ఇక నుంచి అందరూ మారాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications