వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనే అడ్డమైతే..! : గద్వాల జిల్లా కోసం డీకె అరుణ రాజీనామా..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తాను ఎమ్మెల్యేగా ఉన్నందుకే గద్వాల జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం సంసిద్దంగా లేదన్న అభిప్రాయాల నేపథ్యంలో.. గద్వాల జిల్లా కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ. ధర్నాలు, రాస్తారోకోలు, గద్వాల నుంచి జోగులాంబ వరకు పాదయాత్రలు చేసినా.. ప్రభుత్వం మాత్రం గద్వాలను జిల్లా కేంద్రంగా ప్రకటించలేదని వాపోయారు.

కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. అసలు గద్వాల ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదనే ఆరోపణలు చేశారు. గద్వాల జిల్లా ఏర్పాటును పక్కనబెట్టి.. ఆలంపూర్ ను వనపర్తి జిల్లా కేంద్రంలో కలపడం పట్ల తీవ్ర అభ్యంతరాలున్నాయన్నారు.

Gadwal MLA DK Aruna Resigns

గద్వాల జిల్లా విషయమై ఎన్నిసార్లు సీఎం కేసీఆర్ కు వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోలేదన్నారు డీకె అరుణ. 'కేసీఆర్ కు రాజీనామాలంటే చాలా ఇష్టమని చాలామంది చెప్పారు. ఉద్యమ సమయంలో అనేకసార్లు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లినందునా.. రాజీనామాలంటే కేసీఆర్ కు ఇష్టం ఏర్పడిందని కూడా కొంతమంది చెప్పారు. అందుకే ఇప్పుడు గద్వాల జిల్లా కోసం తాను కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది' అంటూ చెప్పుకొచ్చారు డీకె అరుణ.

దీనికి సంబంధించి గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన రాజీనామా లేఖను చదివి వినిపించారు డీకె అరుణ. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపిస్తున్నానని, దాన్ని ఆయన స్పీకర్ కు పంపించి ఆమోదింపబడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

English summary
Senior Congress leader DK Aruna on Saturday 'resigned' from the Telangana Assembly.Interestingly, she held a press conference and said that since the TRS Government was not ready to announce Gadwal district only because she was the MLA representing Gadwal,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X