అప్పుడేం చేశినవ్? స్మితా సబర్వాల్‌పై మరో నేత గరం గరం!

హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఓ చిత్రాన్ని ఎక్స్ వేదికగా రీట్వీట్ చేయడంతో వివాదం ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను వీడటం లేదు. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన కొందరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరికొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు నోటీసులు జారీ చేయడంతో వారి ఎదుట హాజరై విచారణకు సహకరించినట్లు స్మితా సబర్వాల్ వెల్లడించిన విషయం తెలిసిందే.

తాజాగా, స్మితా సబర్వాల్‌పై మరో కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారని స్మితా సబర్వాల్ ను ప్రశ్నించారు కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం. అంతేగాక, ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ఆమె ఏం యాక్షన్ చేస్తుందబ్బా.. ఆమె ఐఏఎస్ అధికారిణి' అని ఆయన వ్యంగ్యంగా స్పందించారు.

Gajjela Kantham criticizes IAS officer Smita Sabharwal

కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియా రీట్వీట్లను ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికిందని గజ్జెల కాంతం ఆరోపించారు. ఆ చెట్లను నరికి వేసినప్పుడు స్మితా సబర్వాల్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. సోషల్ మీడియా పోస్టులు ఎందుకు పెట్టలేదని గజ్జెల కాంతం ప్రశ్నించారు.

ఆ మర్మం ఏందో..? అంటూ సీఎం సీపీఆర్వో

హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ (Smita Sabharwal)కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఓ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన క్రమంలో ఆమెకు ఏప్రిల్ 12న పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్మిత ఎక్స్ వేదికగా స్పందించారు.

పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు స్మిత సబర్వాల్ తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. తాను రీపోస్టు చేసినట్లే రెండు వేల మంది చేసినట్లు చెప్పారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా? అని స్మితా సబర్వాల్ నిలదీశారు.

కంచగచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన నకిలీ ఫొటోను ఆమె సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో శనివారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు ఆమె విచారణకు హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు స్పందించారు.

ఈ నేపథ్యంలోనే స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌పై సీఎం సీపీఆర్వో అయోధ్య రెడ్డి బోరెడ్డి కౌంటర్ ట్వీట్ చేశారు. 'ఆ ఐఏఎస్ అధికారి 'దృష్టికోణం'లో మార్పు ఎందుకొచ్చినట్లు? అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలూ మారొచ్చా?' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

'అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన (CMOలో Irrigation బాధ్యతలు నిర్వహించిన) వీరే. . ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో. .??
అసలు ఏడుపు వన్య ప్రాణుల కోసమా..?? అధికారం కోల్పోయిన వారి కోసమా. .?? ఇవీ కొన్ని ఉదాహరణలు అంటూ సీఎం సీపీఆర్వో ఘాటుగా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+