హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్పీకర్ మధుసూదనా చారిని తొలగించాలి: గండ్ర వెంకటరమణా రెడ్డి డిమాండ్

తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనా చారి అవినీతిని సొంత పార్టీ నేతలే బయటపెట్టారని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి సోమవారం విమర్శించారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్: తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనా చారి అవినీతిని సొంత పార్టీ నేతలే బయటపెట్టారని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి సోమవారం విమర్శించారు.

ఫార్ములా వన్ రేసు మోసం: 'అంజనా రెడ్డి మోసం చేయలేదు, ఏం జరిగిందంటే'ఫార్ములా వన్ రేసు మోసం: 'అంజనా రెడ్డి మోసం చేయలేదు, ఏం జరిగిందంటే'

స్పీకర్ కుమారులు రాజ్యాంగేతరశక్తులుగా మారారని, దీనిపై సిఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు, మావోయిస్టులతో కోదండరాం కుమ్మక్కయ్యారని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడటం విడ్డూరమన్నారు.

Congress leader Gandra Venkataramana Reddy fires at Speaker Madhusudana Chary.

కాగా, వరంగల్ రూరల్ జిల్లా తెరాసలో లుకలుకలు బయటపడ్డాయి. స్పీకర్ మధుసూదనా చారి తనకు రూ.48 లక్షలు బాకీపడ్డారంటూ పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలపెల్లి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

గత ఎన్నికల్లో తాను శాయంపేట మండల పరిధిలోని గ్రామాల్లో మధుసూదనాచారి తరఫున రూ.98.58 లక్షలు ఖర్చు చేశానన్నారు. ఇందులో తనకు రూ.50.35 లక్షలు మాత్రమే ఇచ్చారని చెప్పారు.

ఈ మేరకు స్పీకర్‌ నుంచి తనకు ఇంకా రూ.48.23 లక్షలు రావాలని, వీటిని సత్వరమే తనకు ఇప్పించి న్యాయం చేయాలంటూ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు శ్రీనివాస్‌ రెడ్డి లేఖ రాశారు. అందులో స్పీకర్‌ తనకు బాకీ పడ్డ లెక్కలను పొందుపరిచారు. ఉన్న భూమంతా అమ్మి 17 ఏళ్లుగా తాను సిరికొండ కోసం ఖర్చుచేశానని, వాటిని తనకు ఇప్పించాలన్నారు.

English summary
Congress leader Gandra Venkataramana Reddy fires at Speaker Madhusudana Chary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X