జాబ్ మేళా పేరుతో మోసం: అరెస్టు చేసిన పోలీసులు
జాబ్ మేళా పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాదులోని ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్ : నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తులను హైదరాబాదులోని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ గోనె సందీప్‌రావు వివరాలు వెల్లడించారు.
మల్లాపూర్‌కు చెందిన నెమలి కుమార్(25), మౌలాలి జవహర్‌నగర్‌కు చెందిన లింగాల సుమిత్(26) అద్విత సేవా ఫౌండేషన్ పేరుతో మెగా ఉద్యోగ మేళా ను ఫిబ్రవరి 26న ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాలలో నిర్వహించారు.

ఈ మేరకు నిరుద్యోగుల నుంచి రూ.200 రిజిస్ట్రేషన్ చార్జీ వసూలు చేశారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు వచ్చారు. అయితే ప్రముఖ కంపెనీలు రాకపోవడం, సెక్యూరిటీగార్డులు, ఎల్ఐసీ ఏజెంట్ల వంటి ఉద్యోగాలు ఉండటంతో ఆగ్రహించిన నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు.
అనుమతులు లేకపోవడం, మోసం చేయడం, వారి నుంచి డబ్బులు వసూలు చేయడంపై పోలీసులు కేసు నమోదు చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు.
More From
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications