ఆసక్తికర విషయాలు: నయీం షల్టర్ పొందిన ఇంటి ప్రత్యేకతలివే

హైదారాబాద్: సోమవారం ఉదయం మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌‌లో పోలీసులు ఎదురు కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ నయీం హతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నయీం షెల్టర్‌ పొందిన ఇల్లు, అందులో నివాసమున్న వ్యక్తుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బుధవారం వెలుగుచూశాయి.

జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న మిలీనియం టౌన్‌షిప్‌లో ఉన్న ఈ ఇల్లు, టౌన్‌షిప్‌ మొదట్లోనే ఉంటుంది. ఈ ఇంటికి వెనుక వైపున ఓ ఇల్లు ఉంది. షాద్ నగర్‌లోని నయీం ఇంటి ప్రహరీ గోడ ఎత్తు ఎనిమిది అడుగులు, ఇంటి చుట్టూ చెట్లు. ఈ ఇంట్లో ఏం జరిగినా బయటకు కనబడదు.

నయీం ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఇతర కాలనీ వాసులతో సంబంధాలు లేకపోవడంతో అక్కడి వ్యవహారాలన్నీ గోప్యంగానే సాగిపోతూ ఉండేవి. నయీం షల్టర్ పొందిన ఇంట్లో ఒక వాచ్‌మన్‌, అతని భార్య ఉండేవారని, వాళ్లు ఎవరితోనూ మాట్లాడేవారు కాదని స్థానికులు చెబుతున్నారు.

అంతేకాదు ఇంట్లో ఉన్న వారు ఎప్పుడూ బయటకు వచ్చేవారు కాదని, వాళ్లకు ఒక కుక్క ఉండేదని, దానిని తిప్పేందుకు మాత్రం ఇంటి వాచ్‌మెన్ రోజూ సాయంత్రం పూట కొద్దిసేపు బయటకు వచ్చేవాడని, ఎవరు పలకరించినా ముక్తసరిగా మాట్లాడేవాడని స్థానికులు అంటున్నారు.

 ఆసక్తికర విషయాలు: నయీం షల్టర్ పొందిన ఇంటి ప్రత్యేకతలివే

ఆసక్తికర విషయాలు: నయీం షల్టర్ పొందిన ఇంటి ప్రత్యేకతలివే

నయీం ఈ ఇంటిని గత నాలుగేళ్లుగా షెల్టర్‌గా వాడుకుంటన్నాడని పోలీసులు విచారణలో వెల్లడైంది. అంతేకాదు నయీం షల్టర్ పొందిన ఇల్లు నుంచే దందాలు, సెటిల్‌మెంట్లు కూడా నిర్వహించాడని పోలీసులు తెలిపారు. నయీం షల్టర్ పొందిన ఈ ఇల్లు నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సయ్యద్‌ సాదిక్‌ పేరున 30.7.2012న రిజిస్ట్రేషన్ జరిగినట్లు రికార్డుల్లో ఉంది.

ఆసక్తికర విషయాలు: నయీం షల్టర్ పొందిన ఇంటి ప్రత్యేకతలివే

ఆసక్తికర విషయాలు: నయీం షల్టర్ పొందిన ఇంటి ప్రత్యేకతలివే

నయీం దందాలో భాగంగా దండుకున్న కోట్లాది రూపాయల సొమ్ము, ఆస్తులపై పన్ను చెల్లింపు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు పన్ను చెల్లించే అవకాశమే ఉండదని ఐటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నయీం అక్రమ సంపాదనపై సీఐడీతో పాటు రెవిన్యూ, ఐటీ అధికారుల బృందాలు ఆరా తీస్తున్నాయి.

ఆసక్తికర విషయాలు: నయీం షల్టర్ పొందిన ఇంటి ప్రత్యేకతలివే

ఆసక్తికర విషయాలు: నయీం షల్టర్ పొందిన ఇంటి ప్రత్యేకతలివే

సాధారణ పరిస్థితుల్లో కేసు నమోదుచేసిన తర్వాత స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తులను కోర్టుకు జమచేస్తామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అయితే, ఆ సొమ్మును తమ(ఇన్వెస్టిగేషన టీం)కు స్వాధీనంచేస్తే, వాటికి సంబంధించి పన్ను చెల్లింపులపై విచారణ నిర్వహిస్తామని ఐటీ శాఖ అధికారి ఒకరు చెప్పారు.

ఆసక్తికర విషయాలు: నయీం షల్టర్ పొందిన ఇంటి ప్రత్యేకతలివే

ఆసక్తికర విషయాలు: నయీం షల్టర్ పొందిన ఇంటి ప్రత్యేకతలివే

ఇదిలా ఉంటే నయీంకు సహకరించిన పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందితో పాటు ఇతర విభాగాల అధికారులపైనా పోలీసులు దృష్టి సారించారు. నయీం విషయంలో సీరియస్‌గా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు అతడితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలకు సిద్ధమవుతున్నారని తెలిసింది.

ఆసక్తికర విషయాలు: నయీం షల్టర్ పొందిన ఇంటి ప్రత్యేకతలివే

ఆసక్తికర విషయాలు: నయీం షల్టర్ పొందిన ఇంటి ప్రత్యేకతలివే

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏసీపీగా పనిచేసిన ఓ అధికారి నయీంకు పోలీసుల మద్దతు ఇచ్చినట్లు వెలుగులోకి రావడంతో పోలీసు ఉన్నతాధికారులు దీనిపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+