నయీం భాషలో కోకోనట్ ఎవరు?: ఆర్ధిక లావాదేవీల్లో ఆమె కీలకం
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో దర్యాప్తుని సిట్ బృందం వేగవంతం చేశారు. తాజాగా నయీం గోవా గెస్ట్‌హౌస్‌లో దొరికిన డైరీలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వాసు అనే వ్యక్తి దగ్గర 2014లో నయీం ఈ గెస్ట్ హౌస్‌ను 2014లో కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
గోవా గెస్ట్ హౌస్‌ను నయీం ఫర్హానా పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ఫర్హానాను కోకోనట్ అంటూ నయీం పిలిచేవాడని గోవా గెస్ట్‌హౌస్‌లో దొరికిన డైరీలో రాసుకున్నాడు. అంతేకాదు ఈ డైరీలో నయీం కోడ్ భాషను ఉపయోగించాడు. ఈ కోడ్ భాషను డీ కోడ్ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.
నయీం గోవా గెస్ట్ హౌస్‌లో ల్యాండ్ డాక్యుమెంట్లతో పాటు రూ. 4 లక్షల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా గెస్ట్ హౌస్‌లో నయీం తన భార్యతో పాటు ఫర్హానా, సదా, జీబా, కరీనా అనే మహిళలతో ఎక్కువగా గడిపేవాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

నయీం భాషలో కోకోనట్ ఎవరు?: ఆర్ధిక లావాదేవీల్లో ఆమె కీలకం
నయీం గోవా గెస్ట్ హౌస్‌కు వచ్చినప్పుడు మహిళలు నయీంతో సెటిల్‌మెంట్లకు సంబంధించిన డబ్బుని అప్పగించేవారని తెలుస్తోంది. గోవాలో గెస్ట్‌హౌస్‌తో పాటు చర్చి వద్ద మరో ఇంటిని కోనుగోలు చేశాడు. ఈ ఇంటిని గోవా చర్చి హౌస్‌గా పిలిచేవాడని నయీం డైరీలో రాసుకున్నాడు.

నయీం భాషలో కోకోనట్ ఎవరు?: ఆర్ధిక లావాదేవీల్లో ఆమె కీలకం
నయీం ఆర్ధిక లావాదేవీల్లో ఫర్హానా కీలకపాత్ర పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్‌తో పాటు గోవా లావాదేవీలను ఫర్హానా చూసుకునేది. నయీం దందాల్లో మహిళలే కీలక పాత్ర పోషించేవారు. భూదందాల్లో భాగంగా ఫర్హానా పలుమార్లు బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

నయీం భాషలో కోకోనట్ ఎవరు?: ఆర్ధిక లావాదేవీల్లో ఆమె కీలకం
దీంతో నయీంకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఫర్హానాను నాలుగు రోజులు కస్టడీలోకి పోలీసులు తీసుకున్నారు. నయీం స్వయంగా సెటిల్‌మెంట్లు చేసేవాడా లేక మరెవరితోనైనా దందా కొనసాగించేవాడా లాంటి విషయాలను ఫర్హానా ద్వారా పోలీసులు తెలుసుకోన్నారు.

నయీం భాషలో కోకోనట్ ఎవరు?: ఆర్ధిక లావాదేవీల్లో ఆమె కీలకం
ఈ నాలుగు రోజుల కస్టడీలో నయీంకు సంబంధించిన పూర్తి వివరాలను ఫర్హానా వద్ద నుంచి పోలీసులు రాబట్టనున్నారు. నయీం అనుచరుల్లో కీలక అనుచరుడిగా భావిస్తున్న ఫయీం పరారీలోనే ఉన్నాడు. ఫయీం దొరికితే గానీ నయీంకు చెందిన భూదందాలు, సెటిల్‌మెంట్లు మొత్తం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications