మేము కూడా: బాలకృష్ణకు చంద్రబాబు అద్భుత కానుక
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృషథ్ణకు సంక్రాంతి కానుక ఇచ్చారు. బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపునిచ్చారు.
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృషథ్ణకు సంక్రాంతి కానుక ఇచ్చారు. బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపునిచ్చారు.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా పన్ను మినహాయించిన విషయం తెలిసిందే.

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను మినహాయిస్తున్నట్లు కేసీఆర్ శుక్రవారం నాడు చెప్పారు. చారిత్రక సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం ఓ పాలసీగా పెట్టుకుందని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. బాలయ్య ఆయనను కలిసినప్పుడు ఈ విషయం చెప్పారు.












Click it and Unblock the Notifications