100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జ‌ల‌పాతం.. హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి..?

తెలంగాణలో అనేక పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, కొండలు, కోటలు, జలపాతాలు, చారిత్రక కట్టడాలకు నెలవుగా ఉంది. తెలంగాణలో జలపాతాలు అనగానే కుంతల వాటర్ ఫాల్స్, బొగత జలపాతం, కనకాయ్, గుండాల, భీమునిపాదం, పొచ్చెర, సప్త గుండాల జలపాతాల పేర్లు వినిపిస్తాయి. వీటితోపాటు తెలంగాణలో గాయత్రి జలపాతం కూడా చాలా ఫేమస్. ఈ జలపాతం ప్రత్యేకత ఏంటంటే..? 100 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంది. అంత ఎత్తు నుంచి జలపాతం అందాలు చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో ఉంది.

గాయత్రి జలపాతం ఆదిలాబాద్ గుండా ప్రవహిస్తున్న కడెం నది నుంచి పుట్టింది. ఈ నది నుంచే జలపాతం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జలపాతం దాగి ఉంది. ఇక్కడి సహజసిద్ధంగా ఏర్పడిన పచ్చదనంతో అల్లుకున్న ప్రకృతి అందాలు సందర్శకులు ఆకట్టుకుంటున్నాయి. దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు దుంకుతుంటే ఆ అద్భుతమైన దృశ్యాలు చూసి తీరాల్సిందే. ఇలా ఎత్తయిన గుట్టల నుంచి ప్రవహించే నీటి ధారలు పర్యటకులను కనువిందు చేస్తున్నాయి. భారీ వర్షాల సీజన్ లో ఎగువ నుంచి ఎక్కువ మొత్తంలో వస్తున్న నీటితో ఈ జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య గాయత్రి జలపాతం దృశ్యాలు ఆకట్టుకుంటాయి.

అలాగే గాయత్రి జలపాతంలో ఏటా జాతీయ సన్నాహక క్రీడలను కూడా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వాటర్ రాపేల్లింగ్ ఫీలింగ్, జుమార్, రాఫ్టింగ్ క్లైంబింగ్, బోటింగ్ తదితర సాహస క్రీడలు నిర్వహిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సాహస క్రీడాకారులు ఈ సాహస క్రీడల్లో పాల్గొంటారు. ఈ సాహస క్రీడలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు.

ఇక గాయత్రి జలపాతం చేరుకోవాలంటే..? ముందుగా జాతీయ రహదారి 44 పై నిజామాబాద్, నిర్మల్ మీదుగా నేరెడిగొండ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడినుంచి కుప్టి గ్రామం మీదుగా తర్నంఖుర్ద్ గ్రామానికి చేరుకోవాలి. ఇక నేరెడిగొండ నుంచి తర్నంఖుర్ద్ గ్రామం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే వాహనాలను పార్కింగ్ చేసుకుని 5 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేయాలి.

GayatriWaterfall cascading from a height of 100 feet is located in the Ichoda Mandal of Adilabad

దట్టమైన అటవీ ప్రాంతంలో చిన్న చిన్న వాగులు దాటుకుంటూ స్థానికుల సూచనల మేరకు గాయత్రి జలపాతం చేరుకునే వీలుంది. ఇక్కడ మొబైల్ నెట్ వర్క్, ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోతుంది. అందుకే ముందుగానే కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం ఇవ్వడం బెటర్ అని విశ్లేషకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+