కారణమిదే: జెమిని న్యూస్ మూతకు రంగం సిద్దం?

జెమిని న్యూస్ ఛానెల్‌ను మూసివేసేందుకు సన్‌నెట్‌వర్క్ సన్నాహలు.ఇప్పటికే ఉదయ చానెల్‌ను మూసివేయనున్నట్టు ప్రకటించింది.జెమిని న్యూస్ ఛానెల్ మూసివేతపై ప్రభుత్వానికి నోటీసులు

హైదరాబాద్: ఉదయ న్యూస్ బాటలోనే జెమిని న్యూస్ కూడ మూతపడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. లాభాల్లో లేని సంస్థలను మూసివేయాలని సన్‌నెట్ వర్క్ భావిస్తోంది.ఇందులో భాగంగానే సన్‌నెట్‌వర్క్‌కు చెందిన ఉదయ్‌న్యూస్, జెమిని న్యూ,స్‌ను కూడ మూసివేయనున్నట్టు సమాచారం.

అక్టోబర్ 26వ,తేది నుండి సన్‌నెట్‌వర్క్ నిర్ణయం తీసుకొందని సమాచారం. ఈ మేరకు ప్రభుత్వానికి సన్‌నెట్‌వర్క్ ప్రభుత్వానికి నోటీసును కూడ ఇచ్చిందని సమాచారం. నష్టాల కారణంగానే సంస్థను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఎంటర్టైన్మెంట్ లో తిరుగులేని స్థానం సంపాదించుకున్నప్పటికీ న్యూస్ లో బాగా వెనుకబడి ఉంది.

Gemini News is going to close operation by Oct 26

రేటింగ్స్ పట్టికలో ఆవమానకరమైన స్థితిలో ఉండటం వలన పరువు కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.నిజానికి జెమిని న్యూస్, ఉదయ న్యూస్ పే చానల్స్ కావటం వలన ఒక్కొక్కటి నెలకు కోటి రూపాయల మేరకు సంపాదించి పెడుతూనే ఉన్నాయి.

ప్రకటనల ఆదాయం శూన్యం అనుకున్నప్పటికీ, ఒక్కో చానల్ మీద ఖర్చుపెట్టే 75 లక్షలతో పోల్చుకున్నప్పుడు ఇవి నష్టాల్లో ఉన్నాయని చెప్పటానికి వీల్లేదు. అయితే నామమాత్రపు లాభాలతో నడుస్తూ సన్ నెట్ వర్క్ పరువు తీసే చానల్స్ వద్దనుకుని యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు చానల్స్ సిబ్బంది ఇప్పుడు తీవ్రంగా కలవరం చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+