టిఎస్పీఎస్సీ 'ఏఈఈ' తీపి కబురు: తెలుగులో జనరల్ స్టడీస్, రెండో పేపర్ ఇంగ్లీషే
హైదరాబాద్: ఎల్లుండి (ఆదివారం) జరగనున్న ఆన్‌లైన్ ఏఈఈ పరీక్ష పైన తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా జనరల్ స్టడీస్‌ను తెలుగులో ఇవ్వాలని నిర్ణయించారు.
అభ్యర్థుల కోరిక మేరకు జనరల్ స్టడీస్‌ను తెలుగులో ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని టిఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు. అభ్యర్థుల కోరిక మేరకు తెలుగులో జనరల్ స్టడీస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పడ్డాక తొలి ఉద్యోగ ప్రకటన గత నెల విడుదలైంది. రాష్ట్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను టిఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 3,783 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఈఈ ఉద్యోగాలకు సంబంధిత ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అర్హులు అని చెప్పారు. ఏఈఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ పద్ధతిలో సెప్టెంబర్ 20న రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో నిర్వహిస్తామన్నారు.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తులకు చివరి తేది సెప్టెంబర్ 3. మొత్తం 500 మార్కులకు పరీక్ష ఉంటుంది. కాగా, రాత పరీక్షకు 450 మార్కులు, ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయని తెలిపారు.
ఏఈఈ పోస్టులకు ఆన్‌లైన్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు జనరల్ స్టడీస్ పేపర్ ఇంగ్లీస్‌లో నిర్వహించాలని మొదట నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష రాసే అభ్యర్థులకు జనరల్ స్టడీస్ పరీక్ష ఇంగ్లీష్‌లో నిర్వహించడం వల్ల నష్టం జరుగుతుందని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.
అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సమావేశం నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్‌ను తెలుగులో నిర్వహించాలని నిర్ణయించింది. రెండో పేపర్ మాత్రం ఇంగ్లీష్‌లో రాయాల్సి ఉంటుంది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications