ఇవాంకా పుణ్యమా అని.. ‘గోల్కొండ’ ప్రజల బాధలు తీరాయి!: ఎలాగంటే..?
మంగళవారం(నవంబర్ (28) ప్రారంభం కానున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ ఈ రోజు తెల్లవారుజామునే నగరానికి చేరుకున్న విషయం.
Recommended Video

హైదరాబాద్: మంగళవారం(నవంబర్ (28) ప్రారంభం కానున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ ఈ రోజు తెల్లవారుజామునే నగరానికి చేరుకున్న విషయం తెలిసిందే.
అంతర్జాతీయ సదస్సు, ఇవాంకా రాకతో నగరంతోపాటు గోల్కొండ కోటను కూడా ప్రభుత్వం సుందరంగా తీర్చిదద్దింది. ఈ నేపథ్యంలో తమ ప్రాంతంలో దోమల బెడద సమస్య తీరిందని తెగ సంతోషపడుతున్నారు గోల్కొండ పరిసర ప్రాంతాల ప్రజలు.

సందర్శకులకు అనుమతి లేదు
అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొంటున్న ఇవాంకా ట్రంప్‌తోపాటు 1500 మంది విదేశీ ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు విందు ఇవ్వనున్న నేపథ్యంలో గోల్కొండ కోటలో మంగళవారం నుంచి సందర్శకులకు అనుమతి నిరాకరించారు.

రంగంలోకి జీహెచ్ఎంసీ సిబ్బంది
సాయుధ పోలీసుల పహరా మధ్య గోల్కొండ కోటలో అధికారులు విందు ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్కొండ కోటతోపాటు నలువైపులా దోమల బెడద ఎక్కువగా ఉండటంతో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు ఫాగింగ్ చేయడంతో పాటు హెర్బల్, కెమికల్స్‌ను స్ప్రే చేయించారు.

దోమలకు నో ఫ్లైయింగ్ జోనే
భద్రత పరంగా గోల్కోండ కోటలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా దోమల బెడద ఎక్కువగా ఉండటంతో వాటి నిర్మూలనకు అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. వారంరోజులుగా దోమల నివారణకు స్ప్రే, ఫాగింగ్ చేయడంతో దోమల సమస్య పూర్తిగా తీరిపోయింది.

ఇవాంకా పుణ్యమా అని..
అయితే, ఇవాంకా రాక పుణ్యమా అని తమ ప్రాంతంలో దోమల బెడద తగ్గిందని గోల్కొండ పరిసర ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం. అప్పుడప్పుడు ఫాగింగ్ చేస్తున్నా దోమలు మాత్రం పోలేదని, ఇవాంకా వస్తుందని అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో దోమల లేకుండా పోయాయని స్థానికులు చెబుతున్నారు. కాగా, స్థానికంగా ఉన్న బార్లు, దుకాణాలను విందు నేపథ్యంలో మూసేయించారు.

పరిమళాలు వెదజల్లే..
ఇప్పటికే పరిమళాలు వెదజల్లే లిక్విడ్స్‌తో స్ప్రేయింగ్ పనులు చేస్తుండగా విందురోజు ప్రత్యేక పరిమళాలతోపాటు దోమలను దరి చేరకుండా చేసే లెమన్‌గ్రాస్‌తో తయారు చేసిన ప్రత్యేక అగర్‌బత్తీలను గోల్కొండ కోటలో వినియోగించనున్నారు. లెమన్ గ్రాస్.. దోమల రెపెల్లెంటే కాక సుగంధం వెదజల్లడంతో సదరు అగర్‌బత్తీలను నాందేడ్ నుంచి తెప్పించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications