PrajaPalana: ప్రజాపాలన అభయ హస్తం దరఖాస్తు ఫామ్స్ ఇలా ఉచితంగా పొందండి..
తెలంగాణ ప్రభుత్వం గురువారం నుంచి అభయ హస్తం దరఖాస్తులు స్వీకరిస్తుంది. ప్రజలు ఈ దరఖాస్తు కోసం జిరాక్స్ సెంటర్లు, మీ సేవ కేంద్రాల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. అభయ హస్తం ఫామ్స్ ను చాలా మంది రూ. 20 నుంచి రూ.30 లకు అమ్ముతున్నారు. అయితే వీటిని ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆయా గ్రామాలు, వార్డుల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ ఫామ్స్ ఉచితంగా అందిస్తారు.
ప్రజాపాలన గ్రామ సభల్లోనూ ఈ ఫామ్స్ ను ఉచితంగా ఇవ్వనున్నారు. వీటి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఉచితంగా ఇచ్చే అప్లికేషన్ అని.. ఎవరూ డబ్బులు చెల్లించొద్దని కోరుతున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో వీటిని ఉచితంగా అందిస్తారని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు పొందటానికి జనం అంతా అభయ హస్తం అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

మీకు కూడా అభయ హస్తం దరఖాస్తు కాలనుకుంటే ఈ లింక్ కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ప్రింట్ తీసుకుని నింపి మీ గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో ఈ దరఖాస్తును అందజేయాల్సి ఉంటుంది. జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు.. ఆ తర్వాత కూడా మీ మండల, గ్రామ స్థాయిలోని ప్రభుత్వ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చు.
అభయ హస్తం ఫామ్స్ :
https://drive.google.com/file/d/1Wc9Eeo83xj3Cyp2LZjQrmKS4c1XI-WQq/view
అభయ హస్తం కోసం ఆధార్ కార్డు నెంబర్, జిరాక్స్ కాపీ, రేషన్ కార్డు నెంబర్, జిరాక్స్ కాపీ, ఫోన్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, కంపెనీ పేరు,మీ భూమి పాస్ పుస్తకం నెంబర్, సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలు, కరెంట్ మీటర్ నెంబర్, అమరవీరులు, ఉద్యమకారులు అయితే డెత్ సర్టిఫికెట్, FIR నెంబర్, జైలు, శిక్ష వివరాలు పూరించాలి.












Click it and Unblock the Notifications