'బెడ్రూంగా ఆ గది, గజల్ శ్రీనివాస్ బాగోతం వీడియోల్లో, ఆడదానితో ఎంజాయ్ కోసం, ఇలా బయటకు'

Posted By:
Subscribe to Oneindia Telugu
  Ghazal Srinivas Leaked Video Viral : ఎవరీ గజల్ శ్రీనివాస్?

  హైదరాబాద్: గజల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వెంకటరమణ కాలనీలో ఆలయవాణి వెబ్‌ రేడియోలో జాకీగా పనిచేస్తున్న ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని శ్రీనివాస్‌పై కేసులు నమోదు చేశారు.

  గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలింది: జైలుకు గజల్ శ్రీనివాస్, నో బెయిల్

  కోర్టుకు తీసుకెళ్లేముందు ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. బెయిల్‌ కోసం శ్రీనివాస్‌ చేసుకున్న దరఖాస్తును తిరస్కరించిన నాంపల్లి కోర్టు ఈ నెల 12 వరకూ జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. పక్కా ఆధారాలతో అరెస్టు చేశామని చెప్పారు. బాధితురాలిని బలవంత పెట్టిన పార్వతి అనే మహిళపై కేసు నమోదు చేశామని, త్వరలో ఆమెను అరెస్ట్ చేస్తామన్నారు. కాగా, బాధితురాలు తన గోడును ఓ ఛానల్‌తో వెళ్లబోసుకున్నారు.

   అవసరాల కోసమే బెడ్ రూంగా మార్చుకున్నాడు

  అవసరాల కోసమే బెడ్ రూంగా మార్చుకున్నాడు

  అంతకుముందు, బాధితురాలు ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడారు. ఎనిమిది తాను వర్క్ చేస్తున్నానని, రెండు నెలల క్రితం తమ చైర్మన్ అమెరికా వెళ్లారని, ఆయన గదిని గజల్ శ్రీనివాస్ బెడ్ రూంగా చేసుకొని, తన కార్యకలాపాలు చేసుకుపోయారని ఆరోపించారు. ఆయన అవసరాల కోసమే మేం ఉన్నామన్నట్లుగా వ్యవహరించేవాడన్నారు. తమను ఇబ్బంది పెట్టేవాడని చెప్పారు. స్టాఫ్ అని కూడా చూడకుండా పిచ్చివేశాలు వేసేవాడని తెలిపారు. ఇవన్నీ బాగాలేవని, తనకు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తే వెళ్తానంటే బ్లాక్ మెయిల్ చేసేవాడని పలు ఛానళ్లలో ఆమె తెలిపారు.

  ఎవరికీ చెప్పకుండా వీడియోలు సేకరించా

  ఎవరికీ చెప్పకుండా వీడియోలు సేకరించా

  తాను అంటే గజల్ శ్రీనివాస్‌కు ఇష్టం అని పనిమనిషి పార్వతి కూడా చెబుతుండేదని, రెండు నెలలుగా ఇబ్బంది పడ్డానని, ఇది ఎవరికీ చెప్పలేని పరిస్థితి అని బాధితురాలు అన్నారు. దీంతో ఆధారాలతో ఆయన బాగోతం బయటపెట్టాలని తాను భావించి, వీడియోలు సేకరించానని చెప్పారు. వీటిని పోలీసులకు అప్పగించానని తెలిపారు. ఆయన బిహేవియర్ అసభ్యంగా ఉండేదని, ఊరికే ఎదురుగా కూర్చోమనేవాడని, డ్రెస్సులు, హెయిర్ స్టయిల్స్ గురించి మాట్లాడేవాడని చెప్పారు. జాబ్ వదిలేద్దామనుకుంటే ఇబ్బందులకు గురి చేయడంతో ఆధారాలు సేకరించానని చెప్పారు.

  ఇదీ అతని నిజ స్వరూపం, చాలా వీడియోలు

  ఇదీ అతని నిజ స్వరూపం, చాలా వీడియోలు

  గజల్ శ్రీనివాస్‌కు యాక్సిడెంట్ అయింది కాబట్టే మసాజ్ చేశారని చెబుతున్నారు కదా అని అడగగా.. తాను అక్కడ ఆఫీస్‌లో కంప్యూటర్ వర్క్ చేస్తానని, అలాంటప్పుడు తనకు మసాజ్‌తో ఏం సంబంధమని ప్రశ్నించారు. మొదట నుంచి తాను ఆయన మాట వినలేదని, అందుకే తనపై ఆయనకు కోపం అని చెప్పారు. ఆయనకు సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయని, అతని నిజస్వరూపం ఇదీ అని బాధితురాలు అన్నారు. అతను చెప్పింది తప్పని అంతా వీడియోలో తెలుస్తుందన్నారు.

   కొంతమందిని ఆఫీస్‌కు రప్పించుకునేవాడు

  కొంతమందిని ఆఫీస్‌కు రప్పించుకునేవాడు

  గజల్ శ్రీనివాస్ అప్పుడప్పుడు కొంతమందిని ఆఫీస్‌కు రప్పించుకునేవాడని ఆరోపణలు చేశారు బాధితురాలు. అక్కడకు వచ్చేవాళ్లు మంచివాళ్లు, అది మంచి ఆధ్యాత్మిక కార్యాలయం అని, కానీ ఆయన వల్లే ఇలా అన్నారు. జూనియర్ ఆర్టిస్టులను రప్పించుకునే వారని, ఎవరైనా వచ్చినప్పుడు తన అవసరాల కోసం తమను వెళ్లిపోమని చెప్పేవాడని వాపోయారు. ఇవన్నీ భరించలేకే ఆధారాలతో సహా బయటపెట్టేందుకు తాను సిద్ధమయ్యానని చెప్పారు.

   సార్ మాట వింటే లైఫ్ సెటిల్

  సార్ మాట వింటే లైఫ్ సెటిల్

  సార్ మాట వింటే లైఫ్ సెటిల్ అవుతుందని పని మనిషి కూడా చెప్పేవారని బాధితురాలు అన్నారు. తాను సార్ మాట విన్నాను కాబట్టే లైఫ్ సెటిల్ అయిందని, నువ్వు ఇష్టమని చెబుతున్నారని, మా మాట వింటే నీ లైఫ్ కూడా సెటిల్ అవుతుందని చెప్పేవారని అన్నారు. లేదంటే ఇక్కడి నుంచి వెళ్లలేవు అనే వారని చెప్పారు.

   ఇలా వారి బాగోతం బయటపెట్టా, శృంగారానికి సంబంధించినవి

  ఇలా వారి బాగోతం బయటపెట్టా, శృంగారానికి సంబంధించినవి

  గజల్ శ్రీనివాస్‌కు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, కాబట్టి ఎలా బయటపెట్టాలా అని ఆలోచించి వీడియోలు పెట్టానని బాధితురాలు చెప్పారు. ఆయనతో పాటు పనిమనిషి బాగోతం కూడా బయటపెట్టానని చెప్పారు. పోలీసులకు అన్నీ ఇచ్చానని, అన్ని రకాల అసభ్యకర వీడియోలు ఉన్నాయని చెప్పారు. చెప్పడానికి తనకే ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. నీచమైన కార్యకలాపాలు, శృంగారానికి సంబంధించినవి అన్నారు. ఆమెలా తనను కూడా చేయమని చెప్పారన్నారు.

  ఆడదానితో ఎంజాయ్ చేద్దామనే గుణం

  ఆడదానితో ఎంజాయ్ చేద్దామనే గుణం

  ఆయనది ఆడదానితో ఎంజాయ్ చేద్దామనే గుణం అని బాధితురాలి ఆరోపించారు. ఈ వీడియోల కోసం తాను ఆయన కాళ్లు నొక్కడం చేశానని చెప్పారు. ఆయన గుణం చెప్పేందుకే తాను అలా చేశానని చెప్పారు. ఆడదానితో ఆయన ఎలా ఎంజాయ్ చేద్దామనుకున్నాడో చెప్పానని అన్నారు. ఆయనకు తన లాంటి కూతురు ఉందని, కానీ అలా ఆలోచించలేదన్నారు. అందుకే వీడియోలు తీశానని చెప్పారు. తాను వీడియోల ద్వారా సమాధానం చెప్పానన్నారు.

   జైల్లోనే ఉండాలి

  జైల్లోనే ఉండాలి

  గజల్ శ్రీనివాస్ వంటి వ్యక్తి జైల్లోనే ఉండాలని బాధితురాలు వాపోయారు. ఎవరికైనా ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మనం బయటకు రావాలని, అలా చేస్తే ఇతర మహిళలను రక్షించినట్లు అవుతుందన్నారు. ఆయనకు ఇతరులతో ఎవరితోనైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయో తనకు తెలియదని చెప్పారు. పోలీసులు స్పందించిన తీరు తనకు నమ్మకం కలిగించిందని చెప్పారు. ఈ కార్యాలయంలో ఏదైనా జరిగిందా అంటే కేవలం గజల్ శ్రీనివాస్ వల్లే అని చెప్పారు. ఇతరులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Noted ghazal singer Kesiraju Srinivas (pictured) popularly known as Ghazal Srinivas, was arrested following a complaint of sexual harassment by a radio jockey employed with a private radio channel run by him.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి