చూపలేని స్థితిలో గజల్ శ్రీనివాస్ వీడియోలు, కొత్త ఆధారాలు: అమ్మాయి వస్తే వీరు బయటకు

Posted By:
Subscribe to Oneindia Telugu
  Ghazal Srinivas Leaked Video Viral : ఎవరీ గజల్ శ్రీనివాస్?

  హైదరాబాద్: మహిళకు లైంగిక వేధింపుల కేసులో గాయకుడు గజల్ శ్రీనివాస్ బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై న్యాయస్థానం తీర్పును గురువారానికి వాయదా వేసింది. బుధవారం నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సెక్షన్ 354, 354ఏ బెయిలబుల్ కేసులు అయినప్పటికీ పోలీసులు బెయిల్ ఇవ్వలేదని గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాదులు వాదించారు.

  వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వకుండాననే పోలీసులు అరెస్టు చేశారని, అందుచేత పోలీసు కస్టడీ అవసరం లేదని వాదనలు వినిపించారు. మరోవైపు, గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని పోలీసులు కౌంటర్‌లో దాఖలు చేశారు.

  'బెడ్రూంగా ఆ గది, గజల్ శ్రీనివాస్ బాగోతం వీడియోల్లో, ఆడదానితో ఎంజాయ్ కోసం, ఇలా బయటకు'

  గజల్ విచారణకు అందుబాటులో ఉంటారని, పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారని పూర్తిగా సహకరిస్తారని గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాదులు చెప్పారు. అయితే దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును గురువారానికి వాయిదా వేసింది. ఆయనకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

  గజల్ శ్రీనివాస్‌పై కొత్త కొత్త ఆధారాలు, విషయాలు

  గజల్ శ్రీనివాస్‌పై కొత్త కొత్త ఆధారాలు, విషయాలు

  గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులపై కొత్త కొత్త విషయాలు, ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలు మరిన్ని వీడియోలు పోలీసులకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపు పది నుంచి ఇరవై వరకు వీడియోలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు నెలల నుంచి ఆమె స్టింగ్ ఆపరేషన్ చేసి వీడియోలు సేకరించింది.

  బెయిల్ ఇవ్వొద్దు: గజల్ శ్రీనివాస్ ఆకృత్యాలెన్నో, మరిన్ని వీడియోలు

  వీడియోలో బాధితురాలిని వేధించిన తీరు

  వీడియోలో బాధితురాలిని వేధించిన తీరు

  పోలీసులకు బాధితురాలు ఇచ్చిన వీడియోలో.. ఆమె స్వయంగా వేధింపులకు గురైనవి కూడా ఉన్నాయని తెలుస్తోంది. తనతో పాటు పలువురు బాధితులు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ప్రసారం చేయలేని స్థితిలో వీడియోలు ఉన్నాయని చెబుతున్నారు.

  అమ్మాయి వస్తే బయటకు పంపేవాడు

  అమ్మాయి వస్తే బయటకు పంపేవాడు

  ఆఫీస్‌కు తనకు సంబంధించిన మరెవరైనా అమ్మాయి వస్తే తమను బయటకు పంపించేవాడని బాధితురాలు వెల్లడించారు. ఆలయవాణి ఆఫీసులోనే గజల్ శ్రీనివాస్ రాసలీలలు జరిపేవారని చెప్పారు. ఇందుకు సంబంధించి గజల్‌పై ఉన్న గంటల కొద్ది వీడియోలను పోలీసులకు ఇచ్చారు.

  గజల్ శ్రీనివాస్ వద్దకు బాధితురాలిని పంపిన పార్వతి

  గజల్ శ్రీనివాస్ వద్దకు బాధితురాలిని పంపిన పార్వతి

  గజల్ శ్రీనివాస్ వద్దకు బాధితురాలిని పని మనిషి పార్వతి పంపినట్లుగా చెబుతున్నారు. ఇరువురికి సంబంధించిన ఆకృత్యాలను వీడియోలు తీసి పోలీసులకు ఇచ్చినట్లు చెప్పారు. కాగా, గజల్ శ్రీనివాస్ ఆలయవాణి ఆఫీసులో ఘోర ఆకృత్యాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో కేసు పెట్టి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Punjagutta police on Tuesday arrested noted ghazal singer Kesiraju Srinivas following a complaint of sexual harassment by a 29 year old woman colleague.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి