అమ్రపాలి మార్క్ డ్యూటీ - సడన్ ఎంట్రీ..!!
జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి నగరంలో ఆకస్మిక తనిఖీలు చేసారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రపాలీని సీఎం రేవంత్ ఏరి కోరి ఎంపిక చేసారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో, అమ్రపాలీ అధికారులతో కలిసి నారాయణగూడలో గల్లీల్లో పర్యటించి వివిధ పనులను పరిశీలించారు.
కీలక ఆదేశాలు ఇచ్చారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో శానిటేషన్ పై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కూకట్ పల్లి, జేఎన్టీయు, మూసపేట్, భరత్ నగర్ లో రైతు బజార్ ప్రాంతాల్లో కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. వీధుల్లో పరిశుభ్రమైన వాతావరం ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. చెత్తను తొలగించాలని తెలిపారు. గార్బేజ్ వల్బరేబుల్ పాయింట్ తొలగింపు పై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికులను అందుతున్న సేవలపై ఆరా తీసారు.

విద్యార్థులతో ఆమె సరదాగా కాసేపు ముచ్చటించారు. మర్కెట్ కాంప్లెక్స్‌లో గదుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని జేసీని ఆదేశించారు. శంకర్‌మఠ వద్ద రాంకీ ఆర్ఎఫ్‌సీ వెహికల్ డ్రైవర్‌తోనూ మాట్లాడారు. చెత్త తరలింపు వివరాలను అడిగి అమ్రపాలి తెలుసుకున్నారు. మరో స్కూల్ విద్యార్ధినికి పరిశుభ్రతపై కమిషనర్ అవగహన కల్పించారు. ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షాకాలం కావటంతో గతంలో చోటు చేసుకున్న ఘటలను పరిగణలోకి తీసుకొని అవసరమైన మందుస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications