‘కార్పొరేటర్ల వాట్సాప్ గ్రూప్‌లో పోర్న్ వీడియో ఎలా వచ్చిందంటే.. సారీ’
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల వాట్సప్ గ్రూపులో ఓ నీలి చిత్రాన్ని పోస్టు చేసిన అంశంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్ కిలారి మనోహర్ వివరణ ఇచ్చారు. వెంగళరావు నగర్‌లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
తాను ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉన్నప్పుడు తన అనుచరుడు రవి.. తన డ్రైవర్ వద్ద ఉన్న తన మొబైల్ ఫోన్ తీసుకొని ఇంటర్నెట్ వాడుకోవడంతో పొరపాటున ఆ వీడియో టీఆర్‌ఎస్ కార్పొరేటర్ల గ్రూప్‌లో పోస్టయిందని తెలిపారు. దీనికి పూర్తి బాధ్యత తనదేనని, తనను క్షమించాలని కోరారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల వాట్సాప్ గ్రూపులో పోస్టయిన నీలి చిత్రం వీడియో ఒకటి తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మహిళా కార్పొరేటర్లు దీనిపై ఫిర్యాదుకు సిద్ధమవడంతో ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో జీహెచ్ఎంసీ పెద్దలు వివాదాన్ని సద్దుమణిగేలా చూసినట్లు సమాచారం.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications