ఆరు ఎకరాల్లోనే కళాభారతి, అక్కడ పిల్లలు ఆడుకోవచ్చు

హైదరాబాద్: ఎన్టీఆర్ స్టేడియంలోని 14 ఎకరాల్లో కేవలం ఆరు ఎకరాల్లోనే కళాభారతి నిర్మిస్తామని మిగతా స్థలంలో పార్కింగ్, మొక్కల పెంపకం, వాకర్స్ పాత్ వే వంటివి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తరఫున అడ్వోకేట్ జనరల్ హైకోర్టుకు సోమవారం నాడు తెలిపారు.

ఈ మైదానానికి సమీపంలోని వ్యాయామ కళాశాలకు పదెకరాల స్థలం ఉందని, భవన నిర్మాణం పోను మిగతా దాంట్లో స్థానిక పిల్లలు సాయంత్రం పూట, సెలవు దినాల్లో ఆడుకోవచ్చని తెలిపింది. ఈ విషయాలను పేర్కొంటూ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

తెలంగాణ కళాభారతి ఏర్పాటు కోసం నగరంలోని 14 ఎకరాల ఎన్టీఆర్‌ మైదానాన్ని ప్రభుత్వం సాంస్కృతిక శాఖకు అప్పగించడాన్ని సవాలు చేస్తూ ఇందిరా పార్కు పాదచారుల సంఘం అధ్యక్షులు ఎ సుధాకర్ రావు యాదవ్‌ హైకోర్టును ఆశ్రయించారు.

GHMC counter on Kalabharati

గత విచారణ సందర్భంగా ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసింది. సోమవారం ఈ వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి భోసలే, జస్టిస్‌ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

జీహెచ్‌ఎంసీ తరఫున తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) కె రామకృష్ణా రెడ్డి వాదనలు వినిపించారు. తెలంగాణ కళాభారతి ఏర్పాటులో ప్రభుత్వ ఉద్దేశాన్ని కోర్టుకు తెలిపారు. ఎన్టీఆర్‌ మైదానానికి సమీపంలో సుమారు 68 ఆటస్థలాలున్నాయన్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 728 ఆటస్థలాలున్నాయన్నారు. కళాభారతి ఏర్పాటు అంశం ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని ఇందులో పిటిషనర్‌ జోక్యం చేసుకోవానికి వీల్లేదన్నారు. కళాభారతి నిర్మాణం ఆలస్యమైతే దాని నిర్మాణ భారం పెరుగుతుందన్నారు. విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+