పొద్దున అలా, సాయంత్రం ఇలా: అప్పుడే దొరుకుతారని.. వినూత్నంగా 'గ్రేటర్' ప్రచారం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీలు ప్రచారానికి కొత్త మార్గాల్లో వెళ్తున్నాయి. నగరంలో అనేక మంది ఉదయపు వేళల్లో పార్కులకు నడక కోసం వెళతారు. ప్రత్యేకించి ఇతరులను ప్రభావితం చేయకల ముఖ్యులు పార్కుల్లో కనిపిస్తారు.

వీరిలో కొందరిని ఇళ్ల వద్ద కలవడం కష్టం. కాబట్టి అందువల్ల వారు ఉదయం బయటకు వెళ్లిన సమయంలో కాస్త ఖాళీగా దొరుకుతారని అభ్యర్థులు ఉదయం వేళ ఉద్యానాల బాట పడుతున్నారు. కొందరు. వర్గాలను ఒకచోట చేర్చి వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ వర్గానికి ఏం చేశాం, ఏం చేస్తామో చెబుతున్నారు.

Photos: కవిత హల్‌చల్

మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నచోట్ల బొట్లు పెట్టి ఓట్లు అగడగుతున్నారు. శివారు ప్రాంతాల్లో పేదలు ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఇలాంటి వాడలను కూడా అభ్యర్థులు కొందరు ముందే గుర్తించి వారితో మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా ఓట్లు వేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారట.

GHMC Election: Candidates campaign

పార్టీలు, అభ్యర్థులు సోషల్ మీడియా, కరపత్రాల ద్వారా కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. చాలా మల్టీస్టోరియెడ్ భవంతులలో తాడు కట్టి బుట్టలు కిందకు వేసి ఉంటాయి. వాటిలో ఉదయాన్నే పత్రికలు, పాల ప్యాకెట్లు వేసేందుకు అవి ఉపయోగిస్తారు. అందులో ఆయా పార్టీలు కరపత్రాలు వేస్తూ ప్రచారం చేస్తున్నారు.

కొందరు అభ్యర్థులు ఇంటింటికి డప్పులతో తిరుగుతున్నారు. కొందరు గుర్తును పెద్దగా చేయించి తిరుగుతున్నారు. తమకు కేటాయించిన గుర్తు ఇది అని, దీనికి ఓటు అని వేయమని చెప్పేందుకు వారు పెద్దగా గుర్తులను పెట్టుకొని తిరుగుతున్నారు. సాయంత్రం పార్టీలు, అభ్యర్థులు ప్రధానంగా రోడ్డు షో పైన దృష్టి సారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+