గ్రేటర్ మంట: పెట్రోల్ పోసుకొని ఒకరు, జూ.ఎన్టీఆర్ పేరు చెప్పి మరొకరు (పిక్చర్స్)
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలు తెరాస, మజ్లిస్ పార్టీ మినహా కాంగ్రెస్, టిడిపి, బిజెపిల్లో ఆగ్రహాజ్వాలలు రగిల్చింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన గురువారం ఆందోళనలు, నిరసనలు, ధర్నాలతో పార్టీ కార్యాలయాలు అట్టుడుకాయి.
ఆశావాహులు ఆందోళనలకు దిగి నేతల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌లో ఒక కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
తనకు డూప్లికేట్ బి-ఫారం ఇచ్చారని ఒక మహిళా కార్యకర్త రోజంతా ధర్నా చేశారు. టిక్కెట్ల విషయమై పెద్ద గొడవే జరిగింది. తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపించడం లేదని ఒక మహిళా కార్యకర్త పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గ్రేటర్ గొడవ
టిడిపి-బిజెపిల మధ్య అనేక డివిజన్లలో సమస్య తలెత్తింది. ఇరు పార్టీల ముఖ్య నాయకులు వారం రోజులుగా చర్చలు జరిపినా, కొన్ని డివిజన్లలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు.

గ్రేటర్ గొడవ
గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిపిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. చిలుకానగర్, హబ్సిగుడా, ఉప్పల్, మాదాపూర్, బోరబండ, ఆర్‌కె పురం తదితర 10 డివిజన్లలో రెండు పార్టీలూ బి-ఫారాలు ఇచ్చాయి.

గ్రేటర్ గొడవ
10 డివిజన్లలో స్నేహపూర్వక పోటీ చేయాలని నిర్ణయించాయి. బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి బి-ఫారం తీసుకున్న మాదాపూర్ అభ్యర్థి గరికపాటి సతీష్ చిక్కుల్లో పడ్డారు.

గ్రేటర్ గొడవ
బి-ఫారం తీసుకుని ఆవరణలోకి రాగానే గేటు దాటకుండా ఆ టిక్కెట్ ఆశించిన హరికృష్ణ తన అనుచరులతో అడ్డుపడ్డారు.

గ్రేటర్ గొడవ
సుమారు గంటన్నర పాటు సతీష్‌ను బయటకు వెళ్ళనీయకుండా నినాదాలు చేశారు. బి-ఫారం ఇచ్చేయ్యాల్సిందిగా బతిమిలాడారు.

గ్రేటర్ గొడవ
చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి, సతీష్‌ను బయటకు పంపించారు. ఈ దశలో పోలీసులకు హరికృష్ణ అనుచరులకు మధ్య కొంత తోపులాట జరిగింది.

గ్రేటర్ గొడవ
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ డివిజన్‌ను ఆశించిన తృప్తి సుధాకర్ బి-ఫారం కోసం గంటల తరబడి వేచి చూసి తర్వాత నిరాశగా వెళ్ళిపోయారు.

గ్రేటర్ గొడవ
ఆ డివిజన్ టిడిపి తీసుకోవడ పట్ల రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ నిరసన వ్యక్తం చేశారు. ఇలా ఉండగా పార్టీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ నివాసం వద్ద చర్లపల్లి డివిజన్ కార్యకర్తలు ఎమ్మెల్యే కారుపై దాడి చేశారు

గ్రేటర్ గొడవ
మరోవైపు, బిజెపి మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్ పార్టీకి రాజీనామా చేశారు. టిడిపితో పొత్తు వద్దని తాము చెప్పినా వినిపించుకోలేదన్నారు.

గ్రేటర్ గొడవ
పొత్తు పెట్టుకుంటే టిడిపి కంటే ఎక్కువ సీట్లు తీసుకోవాలని సూచించినా వినిపించుకోలేదని అందుకే రాజీనామా చేసినట్లు ప్రేం సింగ్ అనుచరులు చెబుతున్నారు.

గ్రేటర్ గొడవ
బిజెపి రంగారెడ్డి జిల్లా పట్టణ అధ్యక్షుడు మీసం చంద్రయ్య తన పదవికి రాజీనామా చేశారు. జిల్లాలోని డివిజన్లకు టిడిపితో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక విషయంలో తనను సంప్రదించనందుకు నిరసనగా రాజీనామా చేసినట్లు తెలిపారు.

గ్రేటర్ గొడవ
గురువారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. 150 డివిజన్లకు 2713 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 1214 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

గ్రేటర్ గొడవ
టిఆర్‌ఎస్ అన్ని స్థానాలకు పోటీ చేస్తుండగా, మజ్లిస్ పార్టీ 70 స్థానాలకు పోటీ చేస్తున్నది. ఈ పార్టీల నుంచి కూడా కొంత మంది రెబెల్స్ నామినేషన్లు దాఖలు చేసినా, అందరికీ ఫోన్లు చేసి విరమింపజేశారు.

గ్రేటర్ గొడవ
కాంగ్రెస్, బిజెపి, టిడిపి నాయకులకు మాత్రం జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసి పోటీ చేయించడం గగనమైపోయింది.

గ్రేటర్ గొడవ
ఫలక్‌నుమాలో తన పేరును ప్రకటించి రుక్మిణికి టిక్కెట్ ఇచ్చారని కమలానాయక్ ఆందోళనకు దిగారు. తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కను నిలదీశారు.

గ్రేటర్ గొడవ
టిక్కెట్లు రాని వారు ఆందోళనలకు దిగడంతో పోలీసులు గాంధీ భవన్‌లోని రెండు గేట్లను కొంత సేపు మూసి ఉంచారు.












Click it and Unblock the Notifications