హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ షాక్.. అక్కడ వేడుకలు నిషేధం!!
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాంక్ బండ్ పై పరిశుభ్రతపై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. హైదరాబాద్ నగరవాసులకు షాక్ ఇచ్చిన నిర్ణయం తీసుకున్న జిహెచ్ఎంసి ట్యాంక్ బండ్‌పై జన్మదిన వేడుకలపై నిషేధం విధించింది. జన్మదిన వేడుకల సందర్భంగా అర్ధ రాత్రి కేక్ కటింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించింది.
ట్యాంక్ బండ్ పై పుట్టిన రోజు వేడుకలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిషేధం విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలా వేడుకలను జరుపుకుంటున్న వారందరు మద్యం బాటిళ్లు, మాంసం ఇతర వ్యర్థాలను అక్కడే పడేయడంతో ట్యాంక్ బండ్ పై అపరిశుభ్రత నెలకొంటుందని జిహెచ్ఎంసి ఒక ప్రకటనలో పేర్కొంది.

పుట్టినరోజులు వేడుకలు జరుపుకునేవారు ట్యాంక్ బండ్ పరిసరాలను పాడు చేస్తున్నారని పేర్కొన్న జిహెచ్ఎంసి, హుస్సేన్ సాగర్ నీళ్లలో చెత్తాచెదారం వేస్తున్నారని వెల్లడించింది. ట్యాంక్ బండ్ పరిసరాలను, హుస్సేన్ సాగర్ నీళ్ళను పాడు చేస్తున్నారని గుర్తించి దీనిని ఆపటానికి కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ట్యాంక్ బండ్ పై వేడుకలు చేసుకోవటానికి వీల్లేదని, అదే విధంగా నీళల్లో చెత్తా చెదారం వేసినా చర్యలు ఉంటాయని జీహెచ్ ఎమ్‌సీ అధికారులు హెచ్చరిక బోర్డును ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేశారు. ఎవరైనా వేడుకలు జరుపుకున్నా, వేడుకల పేరుతో అక్కడ చెత్తా చెదారం వేసినా సీసీ కెమెరాలు ఉన్నాయని ఎవరు ఈ నిషేదాజ్ఞలు ఉల్లంఘించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఆజ్ఞలు ఉల్లంఘించిన వారిని సీసీ కెమెరాలలో రికార్డయినా దృశ్యాలతో గుర్తించి చర్యలు తీసుకుంటామని జీ హెచ్‌ఎమ్‌సీ అధికారులు పేర్కొన్నారు.నగరవాసులు ట్యాంక్ బండ్ పై సరదాగా గడపడంతో పాటుగా, ఏ స్పెషల్ అకేషన్ అయినా కేకులు కట్ చేసి అక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు. జిహెచ్ఎంసి తీసుకున్న తాజా నిర్ణయంతో, ఇకపై ట్యాంక్ బండ్ పై కేకులు కట్ చేయడం, వేడుకలు చేసుకోవడం నిషేధం అని తెలియడంతో నగరవాసులు ఉసూరుమంటున్నారు.












Click it and Unblock the Notifications