వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ లాడ్జిలో.. అర్థరాత్రి దెయ్యం ఎటాక్: తండ్రీకొడుకులపై దాడి..

సయ్యద్ మాటలకు లాడ్జ్ ఓనర్ తో పాటు పోలీసులు కూడా కంగు తిన్నారు. లాడ్జ్ ఓనర్ మాత్రం గతంలో ఎప్పుడూ తమ హోటెల్ లో ఇలా జరగలేదని చెప్తున్నాడు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భ్రమించారో.. నిద్ర మత్తులో సరిగా చూడలేకపోయారో తెలియదు గానీ.. మొత్తానికి ఓ దెయ్యం తమపై దాడి చేసిందంటూ ఇద్దరు తండ్రికొడుకులు పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపుతోంది. వారిద్దరూ గాయాలపాలై ఉండటం మరింత అనుమానాలకు తావిస్తోంది.

మహారాష్ట్రకు చెందిన డాక్టర్ సయ్యద్ ఫ్యామిలీ హైదరాబాద్ లో పర్యాటక ప్రదేశాలను వీక్షించడానికి నగరానికి వచ్చారు. చార్మినార్‌కు దగ్గర్లో ఉన్న 'కోజీ లాడ్జ్'లో బస చేస్తున్నారు.
సయ్యద్ ఫ్యామిలీ లాడ్జీలో మొత్తం మూడు రూమ్‌లు తీసుకోగా.. రెండింటిలో కుటుంబ సభ్యులు, మూడో దాన్ని సయ్యద్, అతని తండ్రి వాడుకుంటున్నారు.

ఇదే క్రమంలో ఎవరి రూమ్స్ లో వారు నిద్రిస్తున్న సమయంలో.. ఒక్కసారిగా సయ్యద్ గది నుంచి పెద్ద పెద్దగా అరుపులు, కేకలు వినబడ్డాయి. దీంతో మిగతా కుటుంబ సభ్యులు, లాడ్జ్ లో ఉన్న ఇతర వ్యక్తులు కూడా భయాందోళనకు లోనయ్యారు. ఒక్కసారి ఉలికిపడి బయటకు పరుగులు పెట్టారు.

Ghost attack in a Hyderabad hotel

అనంతరం సయ్యద్ పోలీసులను ఆశ్రయించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏదో ఆకారం మీద దాడి చేసిందని, కళ్లు తెరిచి చూస్తే.. తల లేని మొండెం కనిపించిందని సయ్యద్ పోలీసులతో చెప్పారు. నిద్రలోంచి తేరుకునేలోపే గోడకేసి కొట్టిందని, దీంతో ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయినట్టు అనిపించిందని తెలిపారు.

సయ్యద్ మాటలకు లాడ్జ్ ఓనర్ తో పాటు పోలీసులు కూడా కంగు తిన్నారు. లాడ్జ్ ఓనర్ మాత్రం గతంలో ఎప్పుడూ తమ హోటెల్ లో ఇలా జరగలేదని చెప్తున్నాడు. కాగా, హోటెల్ గది నుంచి తండ్రీకొడుకులు తీవ్ర గాయాలతో బయటకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

సయ్యద్ మాటలకు నివ్వెరపోయిన పోలీసులు.. అసలు ఆ రాత్రి హోటల్ గదిలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

English summary
A Ghost was attacked on father and his son in a hyderabad the case filed by police. Syed, Who came from Maharashtra along with his family was faced this situation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X