ప్రేయసి ఆత్మహత్య: ఆమె లేని లోకంలో ఉండలేనంటూ అతను..
ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేయసి ఆత్మహత్య చేసుకోగా, ఆమె లేని లోకంలో ఉండలేనంటూ ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం వేపలగడ్డలోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నాడు అతను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కొత్తగూడెం మండలంలోని సుజాతానగర్ పంచాయతీ నాయకులగూడెమ గ్రామానికి చెందిన ఓడుగు సంతోష్ (21) ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

అదే గ్రామానికి చెందిన బాలు బాలు వినీల (19) డిప్లమా చివరి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య ప్రేమ అంకురించింది. ఈ సంవత్సరంతో చదువుతు పూర్తి కావస్తుండడంతో ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోయిందనే భయంతో గురువారం రాత్రి వినీల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించరాు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారంనాడు మరణించింది.
తన ప్రియురాలు మరణించిన విషయం తెలిసిన సంతోష్ ఒక్కసారిగా కూలిపోయాడు. కళాశాల ప్రాంగణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించరాు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications