వేధింపు: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య, అది తెలిసి...

నల్గొండ: నల్గొండ జిల్లాలోని సూర్యాపేట మండలం రామన్నగూడెంలో దారుణం జరిగింది. ఓ యువకుడి ప్రేమ వేధింపులు తట్టుకోలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మూడేళ్లుగా విద్యార్థినిని యువకుడు వేధిస్తున్నాడు. పలుమార్లు యువకుడి పైన కేసు నమోదు చేసినా వేధింపులు ఆపలేదు.

దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్య విషయం తెలుసుకున్న సదరు యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతనిని సూర్యాపేట ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సినిమా ప్రొడక్షన్‌ మేనేజర్‌ కిడ్నాప్‌

కార్ల అద్దె చెల్లించలేదంటూ ఓ ట్రావెల్స్‌కు చెందిన నిర్వాహకులు లయన్‌ సినిమా ప్రొడక్షన్‌ మేనేజర్‌, క్యాషియర్‌ను ఫిల్మ్‌సిటీ నుంచి కిడ్నాప్‌ చేశారు. కిడ్నాపర్ల కారు హయత్‌నగర్‌ కెనరా బ్యాంకు చౌరస్తా వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొని పారిపోతుండగా ట్రాఫిక్‌ పోలీసులు వెంబడించి పనామా గోడౌన్‌ వద్ద పట్టుకున్నారు.

Girl commits suicide in Nalgonda district

రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న లయన్‌ సినిమా షూటింగ్‌లో చేజింగ్‌ కోసమని ఎస్‌ఎల్‌వీ సినిమా కంపెనీ వారు సంతోష్‌నగర్‌లోని ఓ ట్రావెల్స్‌ వద్ద 7 కార్లు అద్దెకు తీసుకున్నారు. డిసెంబరు 31న కారు ఛేజింగ్‌లో భాగంగా ట్రావెల్స్‌కు చెందిన రెండు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. దీంతో ట్రావెల్స్‌ నిర్వాహకులు కార్ల డ్యామేజీతో పాటు బాగు చేయించే వరకు అద్దె చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

రెండు రోజుల క్రితం ట్రావెల్స్‌ నిర్వాహకులు జూబ్లీహిల్స్‌లోని ఎస్‌ఎల్‌వీ కంపెనీ కార్యాలయం వద్దకు వెళ్లి గొడవ చేశారు. ఇదిలా ఉండగా ట్రావెల్స్‌కు చెందిన అక్బర్‌, ఇమ్రాన్‌, ఖాదర్‌ షరీఫ్‌, జీసంత్‌ఖాన్‌ ఆదివారం కారులో రామోజీ ఫిల్మ్‌సిటీకి వచ్చారు. షూటింగ్‌ కోసం కార్లు అద్దెకు ఇచ్చిన మరో ట్రావెల్‌ నిర్వాహకుడు మహేష్‌ను గాయపరిచి అతని కారును తీసుకుని ప్రొడక్షన్‌ మేనేజర్‌ దిలీప్‌సింగ్‌, క్యాషియర్‌ రఘును బలవంతంగా ఎక్కించుకుని నగరానికి తీసుకువస్తున్నారు.

కారు హయత్‌నగర్‌ వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. వాహనాన్ని ఆపకుండా పారిపోయారు. సమాచారమందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు కిడ్నాపర్ల కారును వెంబడించి పనామా గోడౌన్స్‌ వద్ద నిలువరించారు. అప్పటికే కిడ్నాపర్ల కారులో ఉన్న క్యాషియర్‌ రఘు ఫోన్‌లో కంట్రోల్‌ రూంకు మెసేజ్‌ పంపించాడు. ప్రొడక్షన్‌ మేనేజర్‌ దిలీప్‌సింగ్‌ ఫిర్యాదుతో హయత్‌నగర్‌ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+