వయసులో ఉన్నాం.. చెప్తే అర్థమవట్లేదా?:పోలీసులపై యువతి రచ్చ
'ఏంటి చూస్తున్నారు.. వెళ్లిపోండి ఇక్కడినుంచి.. మా పర్సనల్ విషయంలో మీ జోక్యమేంటి? అని డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ యువతి పోలీసులను దబాయించింది.
కరీంనగర్: డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ యువతి పోలీసులకు చుక్కలు చూపించింది. తన నోటి దురుసుతో పోలీసులను సైతం లెక్క చేయకుండా నానా మాటలు అనేసింది. తాగడం తమ వ్యక్తిగత విషయమని అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మీకేముందంటూ పోలీసులనే దబాయించింది.
పోలీసులు కూడా ఈ ఘటనను గోప్యంగానే ఉంచాలనుకున్నప్పటికీ.. ఆలస్యంగానైనా విషయం వెలుగులోకి వచ్చింది. నలుగురు యువకులతో కలిసి మద్యం సేవించిన యువతి.. డ్రంకన్ డ్రైవ్ లో పోలీసులకు పట్టుబడటంతో మాటలతో ఎదురుదాడికి దిగింది. పక్కనున్న యువకులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఆ యువతి మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఇంతకీ సదరు యువతి ఏమందంటే:
'ఏంటి చూస్తున్నారు.. వెళ్లిపోండి ఇక్కడినుంచి.. మా పర్సనల్ విషయంలో మీ జోక్యమేంటి? నన్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్.. వయసులో ఉన్నాం.. బయటకు పోతున్నాం.. చెప్తే అర్థం కాదా? ప్రూవ్స్ కావాలా?' అంటూ పోలీసులపై యువతి చిందులేసింది.
పక్కనున్న యువకులు మాత్రం పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమెకు తాగడం అలవాటు లేదని, తొలిసారి మద్యం సేవించడంతో అలా మాట్లాడుతుందని చెప్పారు. ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయాలని పోలీసులను బ్రతిమాలారు. ఇదంతా ఓ వీడియో రూపంలో బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications