కోతి మూక దాడి: డాబాపై నుంచి పడిన యువతి
వరంగల్/ కరీంనగర్: కోతి మూక దాడితో ఒక యువతి భవనంపై నుంచి పడి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన వరంగల్ జిల్లా కాజీపేట పట్టణంలో బుధవారం ఉదయం జరిగింది. పట్టణంలోని విష్ణుపురిలో మహంకాళి గుడి సమీపంలోని దేవరకొండ రాంబాబు, సుమతి దంపతుల కూతురు నాగస్వాతి(22) ఉదయం ఇంటి రెండో అంతస్తుపై బట్టలు ఆరేస్తోంది.
అదే సమయంలో దాదాపు ఇరవై కోతుల గుంపు ఒక్కసారిగా నాగస్వాతిపై దాడి చేసింది. ఈ క్రమంలో నాగస్వాతి డాబాపై నుంచి కింద పడింది. దీంతో ఆమె కాళ్లు విరిగి తీవ్రగాయాలయ్యాయి. బంధువులు ఆమెను నగరంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.
ఆమెకు మరో రెండు వారాల్లో వివాహం జరుగనున్నట్లు స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దాబాలో పనిచేసే బాలుడి హత్య
కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సత్తెక్కపల్లి శివారులో దారణమైన సంఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ దాబాలో పనిచేస్తున్న బాలుడి(14)ని హత్యచేశారు.
దాబాలో పనిచేస్తున్న తోటి పనివాళ్లే ఈ దారుణానికి పాల్పడ్డట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications