పూజ చేస్తానని నిర్బంధించి వారం పాటు బాలికపై పూజారి రేప్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో అతి దారుణమైన సంఘటన వెలుగు చూసింది. పూజ చేస్తానని మాయమాటలు చెప్పి ఓ పూజారి బాలికను తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఆమెను నిర్బందించి వారం రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఖమ్మ జిల్లాలోని సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఈ దారుణ సంఘటన జరిగింది.
విద్యార్థినిపై అసభ్యంగా పిఇటి టీచర్
మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిని పట్ల ఆ పాఠశాల పీఈటీ అసభ్యంగా ప్రవర్తించాడు. పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నప్రేమ్‌సాగర్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాధు చేశారు.

ఇరానీ గ్యాంగ్ అరెస్టు
గత కొంత కాలంగా హైదరాబాద్ నగర ప్రజలను వణికించిన ఇరానీ గ్యాంగ్ ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ సందర్బంగా వారి నుంచి దాదాపు 80 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ గ్యాంగ్ ఎక్కడెక్కడ దోపిడీలకు పాల్పడిందన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ గ్యాంగ్ ఒక్క హైదరాబాద్ లోనేగాక ఆయా రాష్రాల్లో కూడా పలు దోపిడీలకు పాల్పడినట్లు సమాచారం.
యువకుడి దారుణ హత్య
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో సంతోష్(35) అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరుగినట్లు స్థానికులు చెబుతున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications