రేప్ చేసి వీడియోలు తీసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్స్, అరెస్ట్
హైదరాబాద్: ఫేస్‌బుక్ పరిచయం అత్యాచారానికి దారి తీసింది. ఈ సంఘటన హైదరాబాదు శివారు ప్రాంతంలోని బహదూర్ పురాలో జరిగింది. ఓ యువతిని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత యువతిని కలుసుకున్నారు. ఆమె పైన యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
అత్యాచారం సమయంలో వాటిని వీడియో తీశారు. ఆ వీడియోలను చూపించి యువతిని బ్లాక్ మెయిల్ చేశారు. తద్వారా ఆమె నుంచి డబ్బు దండుకున్నారు. అదే పనిగా నిందితులు డబ్బుల కోసం వేధిస్తుండటంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.
రేవ్ పార్టీ భగ్నం
బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం చేసిన ఘటనలో.. పదకొండు మంది తెలుగు అమ్మాయిలను పోలీసులు విడిపించారు. బెంగళూరు శివార్లలో రేవ్ పార్టీలు జరుగుతుండగా, సమాచారం తెలుసుకున్న పోలీసులు దానిని భగ్నం చేశారు. అసభ్య నృత్యాలు చేశారు. పోలీసులు నిందితులను, యువతులను అదుపులోకి తీసుకున్నారు. అందులో తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

బస్సును ఢీకొట్టిన క్రేన్
నెక్లెస్ రోడ్డులో నిర్వహించే పరుగులో పాల్గొనేందుకు వెళ్తున్న విద్యార్థుల బస్సును ఎల్ అండ్ టీకి చెందిన క్రేన్ ఢీకొట్టింది. బస్సులోని 45 మందిలో 24మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇబ్రహీంపట్నం సమీపంలోని మంగళపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఏటా నెక్లెస్ రోడ్డులో 5కే పరుగు నిర్వహిస్తుంటారు.
అందులో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం ఎల్బీ నగర్ నుంచి బయలుదేరిన విద్యార్థుల బస్సు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రవీంద్రభారతి కూడలి మీదుగా సచివాలయ మార్గంలో వేగంగా వెళ్తొంది. అదే సమయంలో ఎల్ అండ్ టీకి చెందిన భారీ క్రేన్ లక్డీకాపూల్ నుంచి నాంపల్లి మార్గంలో వెళ్తోంది.
బస్సు, క్రేన్ రెండూ రవీంద్రభారతి కూడలిలోకి ఒకేసారి చేరుకోవడం, డ్రైవర్లు అప్రమత్తమయ్యేలోపు క్రేను ముందుభాగం బస్సు ఎడమ వైపు డోర్ పక్కగా చీల్చుకుంటూ దూసుకెళ్లింది. బస్సు వేగంగా వెళ్తుండటంతో క్రేను ఢీకొట్టిన ప్రదేశం నుంచి వెనుక వైపు మరో మూడు సీట్ల వరకు చీల్చుకుంటూ పోయింది. క్రేన్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.












Click it and Unblock the Notifications