రేప్ చేశాడు: ఆమె శీలానికి రు. 2 వేల ఖరీదు కట్టిన పెద్దలు
ఓ బాలిక శీలానికి గ్రామ పెద్దలు వెల కట్టారు. అత్యాచారానికి గురైన బాలికకు 2 వేల రూపాయలు చెల్లించి నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు.
జగిత్యాల: ఓ బాలిక శీలానికి గ్రామ పెద్దలు వెల కట్టారు. అత్యాచారానికి గురైన బాలికకు 2 వేల రూపాయలు చెల్లించి నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. న్యాయం చేయాలని కోరిన బాధితురాలి కుటుంబ సభ్యుల పట్ల గ్రామ పెద్దలు వ్యవహరించిన తీరు అది.
ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి గ్రామ పంచాయతీ పరిధిలోని మోతీలాల్ తండాలో జరిగింది. తండాకు చెందిన బాలిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈ నెల 11న పాఠశాలకు వెళ్లి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన గోపాల్ మార్గమధ్యలో అడ్డగించి ఇంటి వద్ద దింపుతానని బైక్‌పై ఎక్కించుకున్నాడు.
సమీప అడవిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి అక్కడి నుంచి పారిపోయాడు. రాత్రికి ఇంటికి చేరుకున్న బాలిక ఘటనను తల్లిదండ్రులకు వివరించింది. శనివారం బాధిత కుటుంబం గ్రామ సర్పంచ్ మహేశ్‌కు తెలుపగా నిందితుడిని పిలిపించి విచారించారు.

నిందితుడికి విధించిన జరిమానా రూ.2వేలు తీసుకుని కూతుర్ని ఆస్పత్రిలో చూపించమని సలహా ఇవ్వడంతో బాలిక తల్లి అక్కడి నుంచి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సర్పంచ్ మహేశ్, నిందితుడు గోపాల్‌పై కేసు నమోదు చేశారు.
మరో ఘటనలో.. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాలిక(14)పై అదే గ్రామానికి చెందిన వినోద్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు. సదరు బాలిక అధికారులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications