ఆమె ఎదురుతిరిగింది: ప్రేమించి.. వాడుకుని.. వేరే యువతితో 'పెళ్లి'!

తనను అన్నివిధాలుగా వాడుకుని చివరకు పెళ్లి చేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నాడని, ఇప్పుడు మరో అమ్మాయి జీవితం నాశనం చేయడానికి సిద్దపడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.

జగిత్యాల: ఫోటో స్టూడియోలో పరిచయం వారిద్దరిని దగ్గరి చేసింది. తర్వాతి రోజుల్లో ఆ దగ్గరితనం ప్రేమకు దారితీసింది. ప్రేమించానని చెప్పిన ప్రియుడు.. నిన్నే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. నిజమేననుకుని నమ్మిన యువతి అతని చేతిలో మోసపోయింది.

చివరకు వేరే యువతిని పెళ్లి చేసుకోవడానికి అతను సిద్దపడటంతో పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరింది. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి గ్రామంలో ఈ విషయం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. కొడిమ్యాల మండలం రామకృష్ణాపూర్‌ గ్రామానికి చెందిన దీప(24)కు ఓ ఫోటో స్టూడియోలో తూర్పాటి కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం ఏర్పడిన ఈ పరిచయం వీరిద్దరిని ప్రేమ దిశగా నడిపించింది. పెళ్లి చేసుకుంటానని కుమార్ మాట ఇవ్వడంతో అతను మాటలు నిజమే అని నమ్మింది.

girlfriend complaint against lover police case filed cheating lover

ఇంతలోనే కుమార్ మనసు మారిపోయింది. గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన మరో యువతితో అతను పెళ్లికి సిద్దపడ్డాడు. గుట్టుచప్పుడు కాకుండా కుమార్ పెళ్లి చేసుకుంటున్నాడన్న విషయం అతని స్నేహితుల ద్వారా దీపకు తెలిసింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అతనిపై ఫిర్యాదు చేసింది.

తనను అన్నివిధాలుగా వాడుకుని చివరకు పెళ్లి చేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నాడని, ఇప్పుడు మరో అమ్మాయి జీవితం నాశనం చేయడానికి సిద్దపడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. దీప ఫిర్యాదుతో కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+