అందగత్తెలు కవ్వించి.. సన్నిహితంగా ఉన్న ఫోటోలతో షాకిస్తారు!
హైదరాబాద్: కొందరు అమ్మాయిలు కవ్వించి, అప్పు తీసుకొని, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు ఖమ్మంలో చోటు చేసుకుంటున్నాయట. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రోడ్ల మీద వెళ్తుంటే వచ్చి.. మెల్లిగా మాట్లాడి, అప్పుగా డబ్బులు ఇవ్వమని వసూలు చేస్తున్నారు.
అలా వెళ్తుంటే.. వచ్చి మాట్లాడుతారు. మనం అక్కడ కలిశాం, ఇక్కడ కలిశామని చెబుతుంటారు. మాటలతో ఆకట్టుకుంటారు. డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తారు. అలా కుదరకుంటే కేసు పెడతామని హల్‌చల్ చేస్తారంట. వారి ధాటికి చాలామంది జేబులు గుల్ల చేసుకుంటున్నారని చెబుతున్నారు.

వ్యాపారులు అమ్మాయిల బారిన పడిన సందర్భాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మాయలేడీలు బాగా మాట్లాడి, డబ్బులు అప్పుగా అడగగానే ఇచ్చి, ఆ తర్వాత ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగితే.. సన్నిహితంగా ఉన్న ఫోటోలు చూపించి కేసు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారట.












Click it and Unblock the Notifications