ప్రాణహితలో గల్లంతు: ఇద్దరు బాలికల మృతదేహాల వెలికితీత
మహదేవ్‌పూర్: పొట్టకూటి కోసం ఊరూరా తిరుగుతూ మహిళల చిక్కువెంట్రుకలు తీసుకుని వంటపాత్రలు ఇచ్చే వంతకంటి వెంకటరమణ (15), పస్తం స్వప్న (13) అనే బాలికలు ప్రాణిహిత నదిలో స్నానం చేసి బట్టలు ఉతికేందుకు బుధవారం సాయంత్రం వెళ్లి నదిలో గల్లంతైన విషయం విదితమే.
మహారాష్ట్ర రెస్వ్యూ టీం సభ్యు వారిరువురి మృతదేహాలను గురువారం సాయంత్రం వెలికి తీశారు. భూపాలపల్లి, బెల్లంపల్లి, పరకాల తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 10 కుటుంబాల్లోని సుమారు 50 మంది గత మూడు నెలలుగా మహారాష్ట్రలోని సిరోంచ పట్టణంలోని ప్రాణహిత ఒడ్డున ఉన్న విఠలేశ్వరస్వామి ఆలయ సమీపంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు.
పెద్దవారందరూ ఉదయాన్నే వంటపాత్రలను గ్రామ గ్రామాన అమ్ముతూ జీవనం సాగిస్తారు. పిల్లలు అదే పట్టణంలో ఉంటూ చిక్కుమెంట్రుకలకు చిన్న చిన్న గిన్నెలు, చెంచాలు విక్రయిస్తూ ఉండి మధ్యాహ్నానికి గుడిసె వద్దకు వెళ్ళి పెద్దవారు వచ్చేసరికి పనులు పూర్తి చేస్తారు.

బుధవారం కూడా భూపాపల్లికి చెందిన వంతకంటి సారయ్య, లక్ష్మి దంపతు కుమార్తె వెంకటరమణ, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన వస్త్రం తిరుపతి కుమార్తె స్వరూప, స్వప్న(13) కలిసి సాయంత్రం ప్రాణహిత నదిలో స్నానం చేసి బట్టలు ఉతుకుతుండగా స్వప్న, వెంకరమణలు నదిలో పడిపోయారు.
దీంతో స్వరూప ఒడ్డున ఉన్న తమ వారికి విషయాన్ని తెలియపరిచింది. రంగంలోకి దిగిన మహారాష్ట్ర పోలీసులు, రెస్క్యూ టీం గురువారం మృతదేహాను వెలికితీయగా సిరోంచ ఆస్పత్రిలో బాలిక మృతదేహాకు పోస్టుమార్టం పూర్తిచేశారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications