హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ ఫర్ట్ కు నేరుగా విమాన సర్వీసులు: ఎప్పట్నుంచంటే?
హైదరాబాద్: ఐరోపా దేశాలకు వెళ్లే ప్రయాణికులకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గుడ్‌న్యూస్ అందించింది. వచ్చే ఏడాది జనవరి 16(2024) నుంచి డైరెక్ట్ విమానాలు ప్రారంభం కానునాన్నాయి. ప్రధాన యూరోపియన్, స్టార్ అలయన్స్ మెంబర్ ఎయిర్‌లైన్ లుఫ్తాన్సా హైదరాబాద్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు డైరెక్ట్ సర్వీసును ప్రారంభించనుంది.
జర్మనీలోని ప్రధాన నగరమైన ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు లుఫ్తాన్సా తొలి డైరెక్ట్ ఫ్లైట్ 2024 జనవరి 16న వైడ్ బాడీ బోయింగ్ B787-9 డ్రీమ్‌లైనర్‌తో ప్రారంభం కానుంది. ఈ విమానంలో 26 బిజినెస్ క్లాస్, 21 ప్రీమియం ఎకానమీ, 247 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. ప్రారంభమై విమానం ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరి, రాత్రి 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈ విమానం హైదరాబాద్ నుంచి రాత్రి 1 గంటలకు బయల్దేరి ఉదయం 6.10కి ఫ్రాంక్‌ఫర్ట్ చేరుకుంటుంది. 8.30 గంటల ప్రయాణ సమయం కలిగిన ఈ విమానం ఫ్రాంక్‌ఫర్ట్-హైదరాబాద్ విమానాశ్రయాల మధ్య వారానికి మూడు సార్లు.. ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు మంగళ, శుక్ర, ఆదివారాల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో సోమ, బుధ, శనివారాల్లో హైదరాబాద్ నుంచి విమానం బయల్దేరుతుంది.
తెలంగాణ, సమీప ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను యూరప్‌లోని అనేక నగరాలు, ప్రాంతాలతో కనెక్ట్ చేస్తుంది ఈ మార్గం. ప్రపంచంలోని ప్రధాన విమానయాన కేంద్రంగా ఉన్న ఫ్రాంక్‌ఫర్ట్ ప్రయాణికులను యూఎస్ఏ, కెనడాతో సహా ఉత్తర అమెరికాలోని చాలా నగరాలను కనెక్ట్ చేసింది. అంతేగాక, లుఫ్తాన్సా ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి లాటిన్ అమెరికాలోని అనేక నగరాలకు కనెక్టివిటీని కలిగివుంది. అయితే, హైదరాబాద్-ఫ్రాంక్‌ఫర్ట్ మధ్య డైరెక్ట్ విమానాల రాకపోకలు విదేశీ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.












Click it and Unblock the Notifications