వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రాచలం జలదిగ్బంధం - రంగంలోని ఎన్డీఆర్ఎఫ్ : నిలిచిన రాకపోకలు..!!

|
Google Oneindia TeluguNews

గోదావరి ప్రవాహం ఉరకలెత్తుతోంది. పరీవాహక ప్రాంతాలను ముంచెత్తుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఇప్పటికే అధికారులు ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు ప్రారంభించారు. ఇక, వరద ప్రాంతాల్లో సేవలు అందించటం కోసం ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. వైద్యులు..ఎన్డీఆర్ఎఫ్ తో పాటుగా జలవనరుల నిపుణులు సైతం ముంపు ప్రాంతాలకు చేరుకున్నారు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

పెరుగుతున్న ప్రవాహం

పెరుగుతున్న ప్రవాహం


హెచ్చరికల జారీతో ముంపు బాధితులంతా పునరావాసాలకు చేరుతుండగా.. ఇళ్ల వద్ద ఉన్న వారు వరద నీటిలోనే వణికిపోతున్నారు. గంటగంటకు ప్రవాహం పెరుగుతోంది. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. భద్రాచలం పట్టణంలోనే దాదాపు సంగం ప్రాంతం వరద నీట మునిగింది. పలు కాలనీల వాసులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. తొమ్మది వేల మందికి పైగా తరలించినట్లుగా అధికారులు చెబుతున్నారు. ద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్య వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో 144 సెక్షన్ విధించారు.

నిలిచిపోయిన రాకపోకలు

నిలిచిపోయిన రాకపోకలు


గోదావరి బ్రిడ్జి పైన రాకపోకలు నిలిపివేశారు. ఛత్తీస్‌గఢ్, ‌ఒడిశా, ఆంధ్ర ప్రాంతాలకు భద్రాచలం నుంచి పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. భద్రాచలంలో పరిస్థితులు తెలుసుకున్న సీఎం కేసీఆర్.. సీఎస్ సోమేశ్ కు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. సహాయక సామాగ్రితో పాటుగా హెలికాప్టర్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మంత్రి పువ్వాడ అజయ్ జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితి పైన ఆరా తీస్తున్నారు. వరదనీరు చేరిన ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ఇళ్లను వదిలి రామని చెబుతున్న వారిని అధికారులు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కల్పిస్తున్నారు.

ప్రత్యేక టీంలు.. హెలికాప్టర్ తో రంగంలోకి

ప్రత్యేక టీంలు.. హెలికాప్టర్ తో రంగంలోకి


చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక మండలాల్లో వందకు పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వరదనీటిలో ట్రాన్స్‌ఫార్మర్‌లు మునిగిపోవడంతో ముందుజాగ్రత్తగా సరఫరా ఆపేశారు. భద్రాచలంలో చిక్కుకున్న గిరిజనుల కోసం ఐటీడీఏ అధికారులు ప్రత్యేక పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.భద్రాద్రి జిల్లావ్యాప్తంగా మిషన్‌ భగీరథ నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. భద్రాచలం ప్రాంతంలో దాదాపుగా ఎటు చూసిన వరద నీరే కనిపిస్తోంది. దీంతో జనజీవనం పూర్తిగా నిలిచిపోయింది.

English summary
Godavari flood water surrounded Bhadrachalam town and colonies, Govt accomidate shelter. CM KCR directed for rescue operation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X