వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలంవద్ద రెండో ప్రమాద హెచ్చరిక; పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రమాద ఘంటికలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ప్రమాద స్థాయిని దాటిందని అధికారులు సోమవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విపరీతంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదులలో వరద ఉధృతి పెరుగుతోంది. ఇదిలావుండగా, గోదావరి నదికి వరద నీరు పోటెత్తడంతో గోదావరి నది నీటిమట్టం పెరుగుతుందని భద్రాచలంలో స్థానిక పరిపాలన అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

గోదావరి ఉధృతి .. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక


ఈరోజు ఉదయం 6 గంటలకు 48.60 అడుగులకు పైగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 11,39, 230 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోందని చెబుతున్నారు. వరద సహాయక చర్యల్లో ఉన్న అధికారులందరూ గోదావరి వరద కట్టడి చర్యల ప్రకారం పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

ధవళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద పాక్షికంగా గేట్ల ఎత్తివేత.. సముద్రంలోకి వరదనీరు

ధవళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద పాక్షికంగా గేట్ల ఎత్తివేత.. సముద్రంలోకి వరదనీరు


ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. దీంతో అధికారులు బ్యారేజీ 175 గేట్లను పాక్షికంగా ఎత్తివేసి 3, 22 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలి వేశారు. ఇక భారీ వర్షాల కారణంగా పాపికొండలు విహార యాత్రకు అధికారులు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. అంతేకాదు పోలవరం పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదం ఘటికలు మోగిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు ఆకస్మికంగా భారీ వరద వచ్చి పడటంతో ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగింది.

 పోలవరం ప్రాజెక్ట్ వద్ద ప్రమాదకరంగా వరద.. పనులు బంద్

పోలవరం ప్రాజెక్ట్ వద్ద ప్రమాదకరంగా వరద.. పనులు బంద్

పోలవరం స్పిల్ వే దగ్గర 30.1మీటర్లకు వరద నీరు చేరుకోవడంతో ప్రస్తుతం ప్రాజెక్ట్ నుండి నాలుగు లక్షల క్యూసెక్కుల కు పైగా దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఈ అర్థరాత్రి సమయానికి 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అంచనా వేస్తున్నారు. గతంలో జూలై నెలలో 30 నుంచి 50 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చిందని, అయితే ఈసారి పది లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గంటగంటకు వరద ఉధృతి పెరుగుతున్న తీరు పోలవరం ప్రాజెక్టుకు గండం పొంచి ఉంది అన్న సంకేతాలను ఇస్తుంది.

విపరీతంగా కురుస్తున్న వర్షాలు .. అధికారులు అలెర్ట్

విపరీతంగా కురుస్తున్న వర్షాలు .. అధికారులు అలెర్ట్

ఇక మరోవైపు ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం గ్రామంలో రాష్ట్రంలో అత్యధికంగా 300 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నందున నదులు, చెరువులు, వాగులు ఉన్న ప్రాంతాలకు సమీపంలోకి వెళ్లవద్దని అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో మరో 3రోజుల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రాణనష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవటం కోసం రెండు రాష్ట్రాలలోనూ అధికారులు రంగంలోకి దిగారు.

English summary
Godavari became furious with floods. As the water level in Bhadrachalam reached 49 feet, the authorities issued a second danger level emergency alert. Alarm bells are ringing at the Polavaram project with the flood coming from above states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X