భద్రాచలం వద్ద మహోగ్రరూపం దాల్చిన గోదావరి: చివరి హెచ్చరిక జారీ
కొత్తగూడెం భద్రాచలం: భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. గురువారం సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టిన ప్రవాహం అర్ధరాత్రి నుంచి మళ్లీ పెరుగుతూ వచ్చింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు గోదావరి నీటి మట్టం 52.1 అడుగుల వద్ద ప్రవహించింది. రాత్రి 9 గంటలకు గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరింది.
గోదావరి నీటిమట్టం 53.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో(చివరి) ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. భద్రాచలంతోపాటు లోతట్టు గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 49 పునరావాస కేంద్రాలకు 4,900 మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు.

గోదావరి నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం మొత్తం వరదనీటిలో మునిగింది. గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలం నుంచి సమీప మండలాలైన దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, ముంపు మండలాలైన కోనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
గోదావరి నీటిమట్టం 56 నుంచి 58 అడుగులకు చేరే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే యంత్రాంగం 430 గ్రామాలకు చెందిన ప్రజలను 40 పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
గుండాల మండలం ముత్తాపురంలో వరదలో చిక్కుకున్న 12 మందిని రక్షించిన ఐదుగురు గజ ఈతగాళ్లను మల్టీ జోన్ -1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అభినందించి నగదు ప్రోత్సాహకాలను అందించారు. భద్రాచలం వద్ద వరదనీటి ప్రవాహం పెరుగుతుండటంతో పట్టణ ప్రాంతంలోని విస్తా క్లాంప్లెక్స్, దేవాలయ ప్రాంగణ పరిధిలోకి వరద చేరకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరద నీటిని మోటర్ల ద్వారా తిరిగి గోదావరిలోకి మళ్లిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. వరద తగ్గుముఖం పట్టే ప్రాంతాల్లో తక్షణం శానిటేషన్ చేయించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
తెలుగు రాష్ట్రాల్లో ఈ టోల్ ప్లాజాల్లో ఫీజుల తగ్గింపు - కొత్త ధరలు, వీటికే వర్తింపు..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications