తెలంగాణ యూట్యూబర్ కు అరుదైన గౌరవం.. UAE గోల్డెన్ వీసా..
తెలంగాణలో పాపులర్ యూట్యూబర్, 'తెలుగు టెక్ ట్యూట్స్' యూట్యూబ్ ఛానెల్ ఫౌండర్ సయీద్ హఫీజ్ కు అరుదైన గౌరవం దక్కింది. డిజిటల్ కంటెంట్ క్రియేషన్, టెక్నాలజీ ఎడ్యూకేషన్ లో ఆయన సేవలను గుర్తించిన యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసాను అందించింది. ఈ వీసా ద్వారా సయీద్ హఫీజ్ పదేళ్ల పాటు తన కుటుంబ సభ్యులతో సహా UAEలో జీవించే అవకాశం ఉంటుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని యైతింక్ లైన్ కాలనీకు చెందిన హఫీజ్.. తన నైపుణ్యం, క్రమశిక్షణ కారణంగా ప్రపంచ గుర్తింపు సాధించిన క్రమంలో పలువురు ఆయన్ను ప్రశంసిస్తున్నారు.
తెలంగాణ యూట్యూబర్ కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. 'తెలుగు టెక్ ట్యూట్స్' యూట్యూబ్ ఛానెల్ ఫౌండర్ సయీద్ హఫీజ్ కు అరుదైన గౌరవం దక్కింది. డిజిటల్ కంటెంట్ క్రియేటింగ్, టెక్నాలజీ ఎడ్యూకేషన్ విభాగంలో హఫీజ్ సేవలను గుర్తించిన యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE).. గోల్డెన్ వీసాను ప్రకటించింది. ఈ గోల్డెన్ వీసాలో భాగంగా హఫీజ్, అతని కుటుంబం పదేళ్ల పాటు యూఏఈలో నివసించడం, విద్యను అభ్యసించడం, ఉపాధిని పొందడం.. తదితర బెనిఫిట్స్ ను అనుభవించవచ్చు. డిజిటల్ జర్నీలో ఇండియన్ టెక్ క్రియేటర్లకు అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లు భావించవచ్చు.
ఇదే విషయంపై హఫీజ్ మాట్లాడుతూ.. ఇది నాకు గర్వకారణం.. నాకు మాత్రమే కాదు టెక్నాలజీ సామర్థ్యాన్ని ఎవరైతే నమ్ముతారో.. సృజనాత్మకతను ఎవరైతే నమ్ముతారో వారికి గర్వకారణం. యూఏఈ గోల్డెన్ వీసా.. అంతర్జాతీయంగా నా పనిని ప్రపంచవ్యాప్తం చేసేందుకు తోడ్పడుతుంది. ఈ మేరకు హఫీజ్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించిన నేపథ్యంలో సదాశివ ఫౌండేషన్ అతడ్ని ఘనంగా సత్కరించింది. కృషి, పట్టుదల ఉంటే ప్రజల జీవితాలు ఎలా మలుపులు తిరుగుతాయో హఫీజ్ నిరూపించారని ఫౌండేషన్ సభ్యులు కొనియాడారు.

హఫీజ్ 2011లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. తెలుగు టెక్ ట్యూట్స్ పేరు పెట్టాడు. ప్రస్తుతం ఆయన ఛానల్ కు 1.79 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. 4 వేలకు పైగా వీడియోలు అప్లోడ్ చేశాడు. యూట్యూబ్ ద్వారా ఆయనకు నెలకు దాదాపు రూ. 2 లక్షలు ఆదాయం వస్తుంది. 2022 లో ఫోర్బ్స్ టాప్ 100 డిజిటల్ స్టార్స్ లిస్టులోనూ ఆయన 32 వ స్థానంలో నిలిచాడు. 2017 లో అప్పటి ఏపీ ప్రభుత్వం అతనికి బెస్ట్ కంటెంట్ అవార్డును అందించింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications