హైదరాబాదీలకు గుడ్‌న్యూస్: నార్త్ సిటీకి మెట్రో పొడిగింపు, ఎక్కడివరకంటే?
హైదరాబాద్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా సీఎం రేవంత్ రెడ్డి.. ఆ వైపునకు మెట్రో పొడిగించాలని నిర్ణయించారు. ప్యారడైజ్-మేడ్చల్(23 కిలోమీటర్లు), జేబీఎస్-శామీర్‌పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్ల డీపీఆర్‌ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వెంటనే డీపీఆర్‌లను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్-2 'బీ'లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, హెచ్ఎఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్ల డీపీఆర్ తయారీ విషయంపై చర్చించిన అనంతరం ఈ మేరకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.

తాను మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలు, ఈ కారిడార్ల రూట్ మ్యాప్‌లపై తనకు మంచి అవగాహన ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రూట్ మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్‌కు కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలు తీసుకోవాలని మెట్రో ఎండీని సీఎం రేవంత్ ఆదేశించారు.
ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్‌బండ్, గుండ్లపోచంపల్లి, బోయిన్‌పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, కండ్లకోయ, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు 23 కిలోమీటర్ల వరకు ఈ కారిడార్ ఉండనుంది. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రమ్‌పురి, ఆల్వాల్, బొల్లారం, హకీంపేట్, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట తూముకుంట, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్ వరకు 22 కిలోమీటర్ల ప్రతిపాదనల మేరకు ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని
మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డికి వెల్లడించారు.
డీపీఆర్‌ను త్వరితగతిన 3 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించినట్టు మెట్రో ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ఫేజ్-2 'ఏ' భాగం మాదిరిగానే 'బి' భాగాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశాలిచ్చారని చెప్పారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!











Click it and Unblock the Notifications