మద్యం ప్రియులకు GOOD NEWS..
రాష్ట్రంలో మద్యం అమ్మకాల జోరు ఊపందుకుంది. రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్.. దీంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు డిమాండ్ కు తగ్గట్లు బీర్ల కంపెనీలు ఉత్పత్తిని పెంచేశాయి. డిమాండ్ కు తగ్గట్లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 13 సంస్థలు బీర్లను తయారు చేస్తుండగా.. నాలుగు కంపెనీల్లో మూడు షిఫ్టుల్లోనూ తయారీని వేగవంతం చేశారు. ఒక్కో కంపెనీ రోజుకు 2 లక్షల బీర్లను తయారు చేసి డిపోలకు సరఫరా చేసేలా ప్రణాళికలు వేసుకున్నాయి.
ప్రభుత్వం నుంచి అనుమతి..
ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కువశాతం బీర్లు తయారు చేసే కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్(UBL). అయితే ఈ కంపెనీ సహా మొత్తం 13 కంపెనీలు రోజుకు సగటున 1.5 లక్షల నుంచి 2 లక్షల కాటన్ల బీర్లను డిపోలకు సప్లయ్ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నాయి. సంబంధిత రుసుములు కూడా చెల్లించాయి. సాధారణ రోజుల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో మాత్రమే బీర్లను తయారీ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. దీంతో మూడు షిఫ్టుల్లో పనులు నిర్వహిస్తున్నాయి. వీటిలో కింగ్‌ఫిషర్ సహా వివిధ బ్రాండ్లకు చెందిన బీర్లు సప్లయ్ అవుతున్నాయి. ఇలా ఆయా కంపెనీల నుంచి ప్రతి రోజు సగటున లక్షన్నర కాటన్ల బీర్లు 19 డిపోలకు చేరుతున్నాయి.













Click it and Unblock the Notifications