Telangana: రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులు

Telangana: రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణలోని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు నేటి నుంచి జమ కానున్నాయని మంత్రి వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఒక ఎకరం వరకు సాగు చేస్తున్న భూములకు సంబంధించి మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ నిధులు జమ కానున్నాయని చెప్పారు.

తెలంగాణ సర్కారు ఈ ఏడాది జనవరి 26 నుంచి రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలను సాయంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 31 నాటికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాల్లో రైతు భరోసా నిధుల పంపిణీ నిలిచి పోగా.. రైతులకు పెట్టుబడి సాయం అందడం ఆలస్యమైంది. అయితే అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. లబ్ధిదారులకు కోడ్ ముగియగానే ఖాతాల్లో డబ్బులు వేస్తామని సర్కారు వెల్లడించింది.

Good News for Telangana Farmers as Rythu Bharosa Funds Will Deposit Today

ఆన్ గోయింగ్ స్కీమ్ కింద రైతు భరోసా నిధుల విడుదలకు ఎవరికి అభ్యంతరం లేకపోవడంతో ఎన్నికల సంఘం కూడా అభ్యంతరం పెద్దలేదని సమాచారం. ఈ క్రమంలో రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోందని తెలుస్తోంది. దీనిలో భాగంగా నేడు ఎకరం వరకు సాగు చేస్తున్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. అనంతరం రెండు ఎకరాల వరకు సాగు చేసే వారి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. అలా పెంచుతూ సాగు చేస్తున్న రైతు ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయనుంది.

ఇదిలా ఉండగా.. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని 563 గ్రామాల్లో ఈ పథకాలను ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఈ నాలుగు పథకాలను ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+