పింఛన్లపై శుభవార్త వినిపించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తుందా? అని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. తాజాగా వీటికి సంబంధించి రాష్ట్ర మంత్రి సీతక్క కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా పింఛన్ల కోసం అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. వీటితోపాటు గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న పింఛన్ల దరఖాస్తులపై నివేదిక సమర్పించాలన్నారు.

ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే చేయూత పథకం కింద పింఛన్లను పెంచబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్టోన్ కట్టర్లు, చేనేత, ఫైలేరియా రోగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు పింఛన్లు అందజేస్తున్నారు. ఆసరా కింద రూ.2016, దివ్యాంగులకు రూ.3016 ఇవ్వనుండగా చేయూత కింద దివ్యాంగులకు రూ.6వేలు, ఇతరులకు రూ.4వేలు అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది.

good news minister seethakka announcement on cheyutha and aasara schemes

చేయూత పథకానికి అర్హులు ఎవరంటే..
దరఖాస్తుదారులు తెలంగాణకు చెందివుండాలి.
ఆర్థికంగా వెనకబడిన కుటుంబానికి చెందినవారై ఉండాలి.
స్టోన్ కట్టర్లు, చేనేత, ఫైలేరియా రోగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికుల్లో ఏదైనా ఒక వర్గానికి చెందినవారై ఉండాలి. దీనికి సంబంధించిన పూర్తి పత్రాలు ఉండాలి.

అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డ్
ఆదాయ ధ్రువీకరణ పత్రం
కుల ధ్రువీకరణ పత్రం
జనన ధ్రువీకరణ పత్రం (వయసు కోసం)
వైద్యుల ధ్రువీకరణ పత్రం
రేషన్ కార్డు
పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
బ్యాంక్ ఖాతా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+