కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.. ఐదు రోజుల్లో రైల్వేస్టేషన్ శుభారంభం!
కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 26వ తేదీన కొమురవెల్లి రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోని కొమురవెల్లి మల్లన్న భక్తులకు మరియు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది.
కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త
కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం సమీపంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ ప్రారంభం భక్తులకు నిజంగా శుభవార్త. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి కొమురవెల్లి ఆలయానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ నుండి కొమురవెల్లికి వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువ. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే భక్తులకు చాలా ఉపయోగంగా ఉంటుందని ప్రధానంగా డిమాండ్ ఉంది.

కొమురవెల్లి రైల్వే స్టేషన్ లో అన్ని మౌలిక సదుపాయాల కల్పన
ఈ క్రమంలో ఈ రైల్వే స్టేషన్ నిర్మించాలని తలపెట్టిన రైల్వే శాఖ ఫైనల్ గా దాన్ని పూర్తి చేసింది. ఈ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం తోపాటు, వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్స్, ప్లాట్ ఫార్మ్స్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ ఏర్పాటుకు రైల్వే శ్రద్ధ పెట్టింది. అంతే కాదు మంచి పార్కింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. రైల్వే కి సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు.
5.33 కోట్ల రూపాయలను ఖర్చు చేసి నిర్మాణం
కొమరవెల్లి మల్లన్న స్వామి భక్తుల దశాబ్దాల కల ఆయన కొమరవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం 5.33 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఇక ఇటీవల ఈ రైల్వే స్టేషన్ ఈనెల 26వ తేదీన ప్రారంభించనున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే తెలంగాణతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణం కష్టాలు తగ్గుతాయి.
దర్శనం సులభంగా అయ్యేలా రవాణా
ట్రైన్ సౌకర్యంతో దర్శనం మరింత సులభంగా అయ్యే అవకాశం ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే అనేకసార్లు కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా 26న ప్రారంభం కానుండటంతో అందరిలో సంతోషం నెలకొంది.












Click it and Unblock the Notifications