వైరల్ వీడియో: హైదరాబాద్, బెంగళూర్ గూగుల్ ఆఫీసుల్లో దివాలీ బ్యాష్.. మామూలుగా లేదుగా..
దీపావళి వెలుగుల పండగ.. ఈ పండగను చిన్నా పెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఆనందంగా జరుపుకుంటారు. దివాలీ పండుగ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పలు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, దుకాణాలు, ఆఫీస్ లు కలర్ ఫుల్ లైట్స్ తో కళ్లు జిగేల్ అనేలా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లోని గూగుల్ ఆఫీస్ లో దివాలీ సెలబ్రేషన్స్ వీడియో ఇప్పుడు నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ తో పాటు బెంగళూరులోని గూగుల్ కార్యాలయంలో కూడా సెలబ్రేషన్స్ జోరు అందుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గూగుల్ ఆఫీస్ లో దీపావళి సెలబ్రేషన్స్ అంబరాన్ని తాకుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 'గూగుల్ ఆఫీస్ హైదరాబాద్ లో దివాలీ పార్టీ' అనే పేరుతో ఈ పోస్టు పెట్టారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 1 లక్షా 22 వేల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజెన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఏ ఉద్యోగికి అయినా ఇది ఒక డ్రీమ్ వర్క్ అని ఒకరు కామెంట్ పెట్టారు. నేను నోయిడాలో ఉంటాను.. కానీ అక్కడికీ ఇక్కడికీ వర్క్ కల్చర్ లో చాలా తేడాలు ఉన్నాయని మరొకతను కామెంట్ పెట్టారు. మరో యూజర్.. నేను లే ఆఫ్ లో భాగంగా బయటకు వచ్చాను. ఎక్కడకు వెళ్లాలి అని కామెంట్ చేశారు.
దీపావళి సందర్భంగా ఆఫీస్ లో ఉద్యోగుల ఎనర్జీ, క్రియేటివిటీకి ఈ వీడియో నిదర్శనంగా ఉంది. ఈ పండుగలో ఉద్యోగులు సంపూర్ణంగా పాల్గొన్నారు. ఆఫీన్ ను కళ్లు చెదిరే లైట్స్ తో అలంకరించారు. రంగోలీలు వేశారు. ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. గేమ్స్ అండ్ పెయింటింగ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఇక బెంగళూరులో గూగుల్ ఆఫీస్.. ఫుడ్ ప్యారడైజ్ గా మారింది. ల్యావిష్ బఫెట్ ను ఏర్పాటు చేశారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI)కు అలవాటు పడిపోయాయి. లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. గూగుల్ సైతం 100కు పైగా జాబ్స్ ను డిజెన్- రిలేటెడ్ జాబ్స్ ను తొలగించినట్లు సీఎన్బీసీ సంస్థ తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రాముఖ్యతను ఇచ్చినట్లు తెలుస్తోందని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications