మీ దగ్గరి ఏటీఎంలు: గూగుల్ సెర్చ్ చెబుతోందిలా!
హైదరాబాద్: కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో చెలామణిలో ఉన్న నోట్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు తెల్లవారుజామునే బ్యాంకులు, ఏటీఎంల వద్ద చేరిపోతున్నారు. ఏటీఎంల వద్ద పెద్ద ఎత్తున జనం ఉండటంతో అందరికీ నగదు లభించడం లేదు.
చెలామణిలో ఉన్న నోట్లను ఇచ్చే ఏటీఎంలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయనే విషయం తెలియక ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు. కాగా, ఈ పరిస్థితిని గమనించిన గూగుల్ ఏటీఎం ఎక్కడుందో తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది.
సింగిల్ క్లిక్‌తోనే మనం ఉండే ప్రాంతానికి దగ్గర్లో ఉన్న ఏటీఎంల వివరాలు క్షణాల్లో వచ్చేస్తాయి. దీని కోసం ప్రత్యేకంగా యాప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. వెబ్ బ్రౌజర్‌లో గూగుల్ హోం పేజీకి వెళితే చాలు.. అక్కడ సెర్చ్‌బార్ కిందే 'ఫైండ్ యాన్ ఏటీఎం నియర్ బై యూ'అని ఉంటుంది.

అక్కడ క్లిక్ చేస్తే వెంటనే మన లొకేషన్ తీసుకుని దగ్గర్లో ఉన్న ఏటీఎంలను చూపుతుంది గూగుల్. మొబైల్‌లో దానిపై క్లిక్‌చేస్తే ఆటోమేటిక్‌గ్గా మ్యాప్స్ యాప్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఆ యాప్ మీ మొబైల్‌లో లేకపోతే బ్రౌజర్‌లోనే మ్యాప్స్ ఓపెన్ చేసి డిస్‌ప్లే చేస్తుంది.
కాగా, పని చేసే ఏటీఎంలను గురించిన సమాచారాన్ని పలువురు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో కూడా అందిస్తున్నారు. అంతేగాక, పలు యాప్, సైట్లను రూపొందించి ప్రజలకు ఈ విధమైన సేవలందించేందుకు ముందుకు వస్తుండటం అభినందనీయం.












Click it and Unblock the Notifications