గోషామహల్ బీఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రముఖి కిడ్నాప్, తెలిసినవారి పనేనా?

హైదరాబాద్: నగరంలోని గోషామహల్ నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ తరఫున పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి కిడ్నాప్‌కు గురయ్యారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయింది.

బంజారాహిల్స్‌లోని ఇందిరా నగర్‌లో చంద్రముఖి నివాసం ఉంటున్నారు. ఆమె మంగళవారం వేకువజామున మూడు గంటల నుంచి కనిపించడం లేదని పలువురు ట్రాన్స్ జెండర్స్ పోలీసులను ఆశ్రయించారు.

Goshamahal MLA contestant Chandramukhi kidnapped

ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంద్రముఖిని కిడ్నాప్ చేశారని చెప్పారు. ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. చంద్రముఖి కిడ్నాప్ తెలిసిన వారి పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.

గోషామహల్ నుండి బీజేపీ తరఫున రాజాసింగ్ లోథ్, కాంగ్రెస్ నుంచి ముఖేష్ గౌడ్ పోటీ చేస్తున్నారు. బీఎల్ఎఫ్ తరఫున చంద్రముఖి పోటీ చేస్తున్నారు. ఇద్దరు రాజకీయ ఉద్దండుల నడుమ చంద్రముఖి పోరు రసవత్తరంగా మారింది. ఇప్పుడు కిడ్నాప్‌కు గురికావడం మరో ట్విస్ట్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+